Rakul Preet Singh: ఆ సమయంలో ఎంతో ఏడ్చానని చెప్పిన రకుల్.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న నటీమణులలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. బ్రూస్ లీ (Bruce Lee) సినిమా వల్ల ఎం.ఎస్.ధోనీ మూవీ మిస్ అయ్యానని రకుల్ చెప్పగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదిగా తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్.ఎస్.ధోని సినిమాలో దిశా పటానీ (Disha Patani) నటించిన పాత్ర తన కోసం సిద్ధం చేసిన పాత్ర అని ఆమె అన్నారు. నా వరకు నా లైఫ్ లో ఆ దశ కష్టతరమైన దశ అని రకుల్ తెలిపారు.

Rakul Preet Singh

ఎం.ఎస్.ధోనీ సినిమాకు నేను హీరోయిన్ గా ఎంపికయ్యానని ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రీడింగ్ పనులను సైతం పూర్తి చేశానని రకుల్ కామెంట్లు చేశారు. అప్పటికే నేను రామ్ చరణ్ (Ram Charan) తో బ్రూస్ లీ సినిమాలో నటిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఆ సినిమాకు సంబంధించిన రెండు పాటల షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో డేట్స్ క్లాష్ అయ్యి ఎం.ఎస్.ధోనీ మూవీ వదులుకున్నానని రకుల్ తెలిపారు.

అయితే రెండు సినిమాలలో రకుల్ ఏదో ఒక మూవీ టీంను రిక్వెస్ట్ చేసి ఉంటే ఎం.ఎస్.ధోనీ మూవీ మిస్ కాకుండా ఉండేవారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎం.ఎస్.ధోని మూవీ మిస్ అయ్యానని ఎంతో ఏడ్చానని రకుల్ చెప్పడంలో నెటిజన్లు ఈ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఎం.ఎస్.ధోనీ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

రకుల్ తర్వాత సినిమాలతో భారీ హిట్లు అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రకుల్ రేంజ్ అంతకంతకూ పెరగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రకుల్ సోషల్ మీడియా వేదికగా తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. రకుల్ తెలుగులో మరిన్ని ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రకుల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

పవన్ ఫుడ్ హ్యాబిట్స్ రివీల్ చేసిన నాగబాబు.. ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus