సింహ స్వప్నం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నటుడు జగపతిబాబు ఈయన తండ్రి రాజేంద్రప్రసాద్ స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో ఈయనకు సినిమా అవకాశాలు చాలా తొందరగా వచ్చాయి కానీ ఇండస్ట్రీలో స్టార్ గా సక్సెస్ అందుకోవడానికి కాస్త సమయం పట్టిందని చెప్పాలి. ఇలా హీరోగా పలు ఫ్యామిలీ కథ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జగపతిబాబుకి ఫ్యామిలీ హీరోగా పేరు పొందడమే కాకుండా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు.
ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈయనకు ఒకానొక సమయంలో అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా అవకాశాలు తగ్గిపోయిన తరుణంలో ఈయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే తను ఉంటున్నటువంటి ఇంటిని కూడా అమ్మాలని భావించారు అలాంటి సమయంలోనే తనకు లెజెండ్ సినిమాలో అవకాశం రావడం సెకండ్ ఇన్నింగ్స్ లో తన దశ తిరిగిపోయిందనే చెప్పాలి. జగపతిబాబు తండ్రి ప్రముఖ నిర్మాత కావడంతో ఈయనకు వారసత్వంగా వందల కోట్ల రూపాయల ఆస్తిని అందించారు.
అయితే ఈయనకు ఉన్నటువంటి కొన్ని వ్యసనాల కారణంగా ఆస్తులు అన్నింటిని కోల్పోయాడు. జగపతిబాబు ఎక్కువగా క్యాసినో, గ్యాంబ్లింగ్ అలవాటు ఉంది. దాని వల్ల చాలానే డబ్బు పోగొట్టుకున్నాను. ఇక కొంతమంది నాకు రావాల్సిన డబ్బు ఇవ్వలేదని తెలిపారు. అయితే తన కుటుంబానికి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెట్టడం వల్లే ఆస్తులన్నింటినీ కోల్పోయానని ఈయన తెలిపారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నా దగ్గర రెండు ఫోన్లు ఉండేవి ఎప్పుడూ ఆ ఫోన్స్ చూసుకుంటూ కూర్చుండే వాడిని
ఎవరైనా ఫోన్ చేస్తారేమో తనకు అవకాశం ఇస్తారేమో అనుకునేవాడిని తనకు ఒక 30 కోట్లు వస్తే చాలు జీవితాంతం నా ఫ్యామిలీతో బ్రతికేయొచ్చు అనుకున్నాను కానీ సెకండ్ ఇన్నింగ్స్ తనకు మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. 30 కోట్లు ఎప్పుడో సంపాదించానని ఇంకా ఎక్కువగా సంపాదిస్తున్నానని అదంతా కూడా తనకు బోనస్ అంటూ ఈయన తెలిపారు. ఇక ప్రస్తుతం తనకు ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అంటూ జగపతిబాబు (Jagapathi Babu) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.