ఆ ఒక్క కారణంతోనే చంద్రబోస్ మాట్లాడలేదా..అందుకే మౌనం వహించారా?

  • March 15, 2023 / 11:28 AM IST

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వేడుకలలో భాగంగా ఆస్కార్ వేదికపై సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాటల రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకలో భాగంగా ఆస్కార్ వేదికపై కీరవాణి మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇలా కీరవాణి ఒక్కరే వేదికపై మాట్లాడగా చంద్రబోస్ మాత్రం మౌనంగా ఉంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక చివరిలో వేదిక నుంచి వస్తున్న సమయంలో నమస్తే అంటూ ఈయన మాట్లాడారు. ఇలా చంద్రబోస్ ఆస్కార్ వేదికపై ఏవైనా రెండు మాటలు మాట్లాడి ఉంటే బాగుండేదని ఎంతోమంది అనుకున్నారు అయితే వేదికపై చంద్రబోస్ మాట్లాడకపోవడానికి కూడా ఓ కారణం ఉంది.

ఆస్కార్ కమిటీ రూల్స్ ప్రకారం ఒక సినిమాలో ఎంతమందికి ఆస్కార్ అవార్డులు వచ్చినా కూడా వేదికపై ఒక్కరే మాట్లాడాలని నిబంధన ఉండడం చేతనే చంద్రబోస్ మౌనంగా ఉండడంతో కీరవాణి వేదికపై మాట్లాడారు. అలాగే ఆస్కార్ వేదికపై ఒక్కొక్కరు కేవలం 45 సెకండ్ల పాటు మాత్రమే మాట్లాడాలని నిబంధన ఉంది. ఇలా ఆస్కార్ కమిటీ నిబంధన పెట్టడం వల్లే ఈ వేదికపై కీరవాణి ఒక్కరే మాట్లాడారని చంద్రబోస్ మౌనంగా ఉన్నారని తెలుస్తుంది.

ఇక చంద్రబోస్ మాటలు రూపంలో తన సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోయినా ఆస్కార్ అందుకోవడంతో ఆ సంతోషం తన మొహంలో ఎంతో స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. ఏది ఏమైనా ఇలా ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుతూ ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో గర్వపడటమే కాకుండా సంబరాలు చేసుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus