Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఈవారం ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..! ఏం జరగబోతోందంటే.?

బిగ్ బాస్ హౌస్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేం. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ గొడవలు పడుతూ కొట్టుకుంటూ ఉంటే, ప్రతివారం ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి ఆసక్తిని క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా 13వ వారం ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోందని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.,13వ వారం నామినేషన్స్ లో ఈసారి కెప్టెన్ ఇనయా ఇంకా శ్రీహాన్ ఇద్దరు తప్ప మిగతా కుటుంబసభ్యులు ఉన్నారు.

వీళ్లలో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి, ఫైమా ఇంకా శ్రీసత్య ఉన్నారు. వీరిలో నుంచీ ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేష్ లో భాగంగా ఇంటికి పంపించేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. హౌస్ మేట్స్ ఓటింగ్ లో భాగంగా చూస్తే మెజారిటీ ఓట్లు ఆదిరెడ్డికి ఇంకా శ్రీసత్యకి , అలాగే ఫైమాకి వచ్చినట్లుగా తెలుస్తోంది. వీళ్ల ముగ్గురులో నుంచీ ఒకరిని బయటకి పంపించేసే బాధ్యత కెప్టెన్ ఇనయకి అప్పజెప్పినట్లుగా సమాచారం.

ఎందుకంటే, ఇలాంటి సిట్యువేషన్ లో వేరే భాషల్లో అయితే కెప్టెన్ కి ఈ టాస్క్ ని అప్పజెప్తారు. మరి వీళ్లలో ఇనయా ఎవరిని ఇంటికి పంపించేస్తుందనేది ఇప్పుడు ఆసక్తకరంగా మారింది. నిజానికి ఇలాంటి మిడ్ వీక్ ఎలిమినేషన్స్ తెలుగు ప్రేక్షకులకి కొత్తగానే ఉంటుంది. కానీ, హిందిలో, మరాఠీలో, కన్నడలో , తమిళంలో ఇప్పటికే చాలాసార్లు ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది చేశారు. అప్పుడు ఇంట్లో నుంచీ స్ట్రాంగ్ ప్లేయర్ బయటకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మరి ఇప్పుడు కెప్టెన్ కి ఈ భాద్యతని ఇచ్చారు కాబట్టి ఎవరి పేరు చెప్తుందనేది చూడాలి. అలాగే, ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ కనక చేస్తే ఓటింగ్ తో సంబంధం ఉంటుందా. లేదా హౌస్ మేట్స్ మెజారిటీ ఓటింగ్ తోనే పంపించేస్తారా అనేది చూడాలి. మొత్తానికి ఈవారం బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడన్నమాట. అదీ మేటర్.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus