ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..! ఏం జరగబోతోంది..!

బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికరమైన ఎలిమినేషన్ కి తెరలేచిందా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో విసిగిపోయిన బిగ్ బాస్ చివరకి టాస్క్ రద్దు చేసేవరకూ వచ్చాడు. ఇప్పటికే ఓటింగ్ లేక జుట్టు పీక్కుంటున్న నేపథ్యంలో ఈవారం డబుల్ ఎలిమినేషన్ అవసరమైతే ట్రిబుల్ ఎలిమినేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఈసారి 13మంది హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

సూర్య, గీతు తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఈవారం డేంజర్ గానే ఉన్నారు. అయితే, ఇప్పటివరకూ అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ ని కొన్ని గమనించినట్లయితే, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్, బాలాదిత్య ఈ ఐదుగురు సేఫ్ గానే ఉన్నారు. వీళ్లకి సోషల్ మీడియాలో అన్ అఫీషియల్ సైట్స్ లో ఓటింగ్ అనేది బాగానే జరుగుతోంది. అందరికంటే రేవంత్, శ్రీహాన్ లు టాప్ లో ఉన్నారు. దీన్ని బట్టీ చూస్తే ఈ 5గురు సేఫ్ గా నే ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక మిగిలిన వాళ్లలో ఫైమా, రోహిత్ లకి కూడా ఓటింగ్ అనేది బాగానే అవుతోంది. కాబట్టి, వీరిద్దరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. మిగతా వాళ్లలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. రాజ్, కీర్తి ఇద్దరూ డీప్ డేంజర్ జోన్ లో ఉంటే, శ్రీసత్య, ఇనయ, మెరీనాలు కొద్దిగా బెటర్ పొజీషన్ లో ఉన్నారు. ఇక వాసంతీ కూడా లీస్ట్ లో డేంజర్ జోన్ లో ఉంది. ఫైనల్ గా ఈవారం ముగ్గురికి డేంజర్ అనే చెప్పాలి.

రాజ్, కీర్తి, వాసంతీ వీళ్లలో ఎవరైనా వెళ్లిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఓటింగ్ కి కొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి ఏదైనా మార్పులు జరగచ్చు. వీకండ్ అయితేనే కానీ, ఫైనల్ రిజల్ట్ అనేది రాదు. ఈవారం పెర్ఫామన్స్ ఇచ్చేందుకు టాస్క్ కూడా రద్దు అయ్యింది కాబట్టి ఏ హౌస్ మేట్ ఎలిమినేట్ అవుతారు అనేది చెప్పలేని పరిస్థితి. అదీ మేటర్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus