Telugu Indian Idol: ఈ వారం ఇండియన్ తెలుగు ఐడల్ స్పెషల్ షో..!

‘ఆహా’.. తెలుగులో లీడింగ్ ఓటిటి సంస్థ అనే విధంగా అగ్ర పీఠాన్ని అధిష్టించిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో విభిన్న పద్ధతుల్ని ఫాలో అవుతుంది. ఇప్పటికే ‘అన్స్టాపబుల్’ వంటి టాక్ షోలతో పాటు కొన్ని సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేస్తూ తన సత్తాని చాటింది. అంతేకాదు కొన్ని కొత్త సినిమాలని హై క్వాలిటీ వెర్షన్లలో విడుదల చేసే పద్దతిని కూడా ఆహా ప్రారంభించింది. ఇక కొత్త ట్యాలెంట్ ను వెలికి తీసేందుకు..

తెలుగు ఇండియన్ ఐడల్ ను కూడా స్థాపించిన సంగతి తెలిసిందే.తెలుగు సినిమాలకు గాన గంధర్వులని అందించడమే లక్ష్యంగా ఈ షోని నిర్వహిస్తుంది. ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్, సింగర్ అయిన శ్రీరామ్ చంద్ర ఈ షోని హోస్ట్ చేస్తుండగా నిత్యా మేనన్, తమన్ సింగర్ కార్తీక్ వంటి వారు మెంటర్స్ వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే 22 ఎపిసోడ్లు సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా 23వ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9 గంటల నుండీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ ఎపిసోడ్ కు ఓ స్పెషాలిటీ ఉంది. స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి స్పెషల్ గెస్ట్ గా హాజరుకాబోతున్నారు. ఈ ఎపిసోడ్ ను ‘లిరిసిస్ట్ స్పెషల్’ గా ప్రమోట్ చేశారు. ప్రస్తుతం పోటీలో ఉన్న 9 మంది సింగర్స్ లో 3 మంది టాలెంటెడ్ సింగర్స్ ను ఫిల్టర్ చేయనున్నారు రామజోగయ్య శాస్త్రి. మరి ఆ 9 మంది కంటెస్టెంట్స్ లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఎవరో తెలియాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus