Kalki 2898 AD: ‘బాహుబలి 2’ తర్వాత ‘కల్కీ..’ నే.. చాలా అడ్వాంటేజ్..!

దాదాపు 3 నెలల నుండి సరైన సినిమా రిలీజ్ కాలేదు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించుకున్నా వాటికి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అందలేదు. ‘కోవిడ్ టైంలో కంటే కూడా దారుణంగా ఉంది పరిస్థితి’ అంటూ మల్టీప్లెక్స్ ఓనర్సే చెప్పారు అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉంది అనేది. ఇలాంటి టైంలో ప్రభాస్ నటించిన ‘కల్కి..’ (Kalki 2898 AD) సినిమా రిలీజ్ అవుతుంది అంటే… కేవలం ప్రభాస్ (Prabhas) అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో టికెట్లు బుక్ చేసుకున్నారు.

సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. వర్షాలు ఎడతెగకుండా కురిసినప్పటికీ లెక్కచేయకుండా థియేటర్లకు వెళ్లారు ప్రేక్షకులు. ఫలితంగా మొదటి వారమే రూ.700 కోట్లు వసూళ్లు వచ్చాయి ‘కల్కి..’ కి..! వీక్ డేస్ లో కూడా ఈ సినిమా స్టడీగా కలెక్ట్ చేసింది సాధారణంగా ‘బాహుబలి 2’ (Baahubali) తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి.. కానీ బ్రేక్ ఈవెన్ కాలేదు. ‘సలార్’ కి (Salaar) హిట్ టాక్ వచ్చినా ‘డంకీ’ తో (Dunki) పోటీ వల్ల అది బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది.

‘కల్కి..’ విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమో అని బయ్యర్స్ కంగారు పడ్డారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఉండటం వల్ల.. వీక్ డేస్ లో కూడా ‘కల్కి..’ కి మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి. రెండో వీకెండ్ కూడా ‘కల్కీ..’ కి అడ్డులేకుండా పోయింది. బరిలో ఒక్క క్రేజీ మూవీ కూడా లేదు. అందువల్ల రెండో వీకెండ్ ను కూడా ‘కల్కీ..’ క్యాష్ చేసుకోవడం మాత్రమే కాకుండా..

బ్రేక్ ఈవెన్ కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందీ, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఇంకా పుంజుకుంటే మాత్రం 2 వ వీకెండ్ కే రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా అధిగమించే అవకాశాలు ఉంటాయి. మొత్తంగా ‘బాహుబలి 2’ తర్వాత ‘కల్కీ..’ రూపంలో ప్రభాస్ కి ఓ క్లీన్ హిట్ పడుతుంది అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus