This Weekend Releases: ‘బింబిసార’ టు ‘పక్కా కమర్షియల్’.. ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు..!

2022 సెకండాఫ్ కు శుభారంభం దక్కలేదు. జూలై నెలలో విడుదలైన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ‘విక్రాంత్ రోణ’ అనే డబ్బింగ్ సినిమా మాత్రం మంచి ఫలితాన్ని అందుకుంది. థియేటర్ కి జనాలు రావడం బాగా తగ్గించేశారు. సినిమా బాగుంటుంది అంటే వస్తున్నారు. అది కూడా బజ్ క్రియేట్ అయిన సినిమాలకే..! మంచి టాక్ రాకపోతే వెంటనే బోల్తా కొట్టేస్తున్నాయి. జూన్ నెల వరకు కొంత బెటర్. కనీసం కొత్త సినిమాలకు ఓపెనింగ్స్ అయినా దక్కేవి. కానీ జూలైలో రిలీజ్ అయిన సినిమాలు రిలీజ్ రోజునే స్లీపేస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ కు ఓ మంచి సక్సెస్ కావాలి. ఈ వారం కూడా థియేటర్/ ఓటీటీల్లో కలుపుకుని 10 సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లకు పోటీగా ఓటీటీల్లో క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) బింబిసార:

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… కథాంశంతో తెరకెక్కిన మూవీ ఇది. కళ్యాణ్ రామ్ కెరీర్లో 18వ చిత్రంగా రూపొందిన ఈ మూవీ రూ.45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఆగస్టు 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

2) సీతా రామం:

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సీతా రామం’. యుద్ధంతో రాసిన ప్రేమకథ… అనేది దీనికి క్యాప్షన్.ఆగస్టు 5నే తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

3) పక్కా కమర్షియల్:

గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

4) మహా:

స్టార్ హీరోయిన్ హన్సిక కెరీర్లో 50 వ చిత్రంగా రూపొందిన ఈ మూవీ చాలా సైలెంట్ గా ఆగస్టు 5 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కాబోతుండడం విశేషం.

5) కడువా :

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ మూవీ ఆగస్టు 4 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.వివేక్ ఒబేరాయ్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

6) డార్లింగ్స్:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కొత్త చిత్రం ‘డార్లింగ్స్’ కూడా ఆగస్టు 5 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) హ్యాపీ బర్త్ డే :

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 8 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) క్రాష్ కోర్స్ :

ఈ హిందీ వెబ్ సిరీస్ ఆగస్టు 5 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) కార్టర్ :

ఈ కొరియన్ మూవీ ఆగస్టు 5 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) లైట్ ఇయర్:

క్రిస్ ఎవాన్స్ నటించిన ఈ మూవీ ఆగస్టు 3 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) ది సాండ్ మెన్:

ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 5 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) థర్టీన్‌ లైవ్స్‌ :

ఈ హాలీవుడ్ మూవీ ఆగస్టు 5 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.

13) ది గ్రేట్ వెడ్డింగ్ ఆఫ్ మున్నేస్ :

ఈ హిందీ మూవీ ఆగస్టు 4 నుండి వూట్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) ఆల్‌ ఆర్‌ నథింగ్‌ :

ఈ వెబ్‌ సిరీస్‌ ఆగస్టు 4 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) మాయోన్ :

సత్యరాజ్ కొడుకు సిబి నటించిన ఈ మూవీ తమిళ్ వెర్షన్ ఆగస్టు 5 నుండి సింప్లీ సౌత్ లో స్ట్రీమింగ్ కానుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus