మూడో దశ కరోనా తీవ్రత కాస్త తెరిపినివ్వడంతో వాయిదా పడిన సినిమాలన్నీ రిలీజ్ అయ్యేందుకు టైం సెట్ చేసుకుంటున్నాయి. అలాగే త్వరలో పెద్ద సినిమాల జాతర మొదలవుతుందని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనౌన్స్ చేయడంతో సినీ లవర్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఓటీటీ రిలీజ్‌లు మాత్రం రెగ్యులర్‌గా స్ట్రీమింగ్ అవుతూనే వున్నాయి. మరి ఈ వారం థియేటర్‌లు, ఓటీటీల్లోకి ఏమేం రిలీజ్ అవుతున్నాయో ఒకసారి చూస్తే..
1) సామాన్యుడు: విశాల్ హీరోగా నటించిన చిత్రం ‘‘సామాన్యుడు’’. వాస్తవానికి ఈ సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా నైట్ కర్ఫ్యూలు విధించడం, థియేటర్లలో 50 శాతం ఆక్యూపెన్సీకి మాత్రమే ప్రభుత్వం అనుమతించడంతో పొంగల్ బరి నుంచి తప్పుకుంది. అయితే ప్రస్తుతం పరిస్ధితులు కుదుటపడటంతో సామాన్యుడు ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తు.ప.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ స్వయంగా నిర్మించారు. ఇందులో ఆయనకు జోడీగా డింపుల్ హయాతి నటించారు. కెవిన్‌రాజ్ ఛాయగ్రహణం అందించగా.. యువన్‌శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.
2) కోతల రాయుడు: చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు శ్రీకాంత్ హీరోగా నటించిన చిత్రం కోతల రాయుడు. ఇప్పటికే ఈ టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి సినిమా రావడంతో శ్రీకాంత్ మూవీపై అంచనాలున్నాయి. దీనికి తోడు ఇటీవల బాలయ్య- బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండలో శ్రీకాంత్ పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం కూడా కోతల రాయుడికి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన డింపుల్ చోపడే, నటాషా దోషి హీరోయిన్లుగా నటించారు.
3) కోటికొక్కడు: కన్నడ సుదీప్ హీరోగా శివ కార్తిక్ తెరకెక్కించిన ‘కె3’. కోటికొక్కడు కూడా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధా దాస్, ఆషికలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో సుదీప్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు.
4) అతడు ఆమె.. ప్రియుడు : ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మెగాఫోన్ పట్టి దర్శకత్వంలో వహించిన సినిమా ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్, కౌశల్, బెనర్జీ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది.
ఇక ఓటీటీల విషయానికి వస్తే :
అమెజాన్ ప్రైమ్ వీడియో
5) రీచర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 4
నెట్‌ఫ్లిక్స్
6) ద టిండర్ స్విండ్లర్(హాలీవుడ్) ఫిబ్రవరి 2
7) ఫైండింగ్ ఓలా(వెబ్ సిరీస్) ఫిబ్రవరి 3
8) మర్డర్ విల్లే (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 3
9) థ్రూ మై విండ్ (హాలీవుడ్)ఫిబ్రవరి 4
10) లూప్ లపటే (హిందీ) ఫిబ్రవరి 4
జీ5
11) 100 (కన్నడ) ఫిబ్రవరి 4
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
12) ద గ్రేట్ ఇండియన్ మర్డర్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 4
సోనీ లివ్
13) రాకెట్ బాయ్స్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 4
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!