మార్చి నెల నుండి పెద్ద సినిమాలు విడుదలవుతూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా కరోనా కారణంగా తర్వాత ఆంధ్రాలో నెలకొన్న టికెట్ రేట్ల ఇష్యు కారణంగా వాయిదా పడ్డ సినిమాలు. ‘రాధే శ్యామ్’ నుండి రెండు వారాలకో పెద్ద సినిమా అన్నట్టు విడుదలవుతూ వస్తుంది.అటు తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’, ‘కె.జి.ఎఫ్ 2’ లు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ శుక్రవారం కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లలోనే కాదు ఓటిటిల్లో కూడా సినిమాలు విడుదల కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) కె.ఆర్.కె( కణ్మణి రాంబో ఖతీజా) : విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయనతార లు హీరోయిన్లుగా తమిళంలో ‘కాతు వాక్కులా రెండు కాదల్’ టైటిల్ తో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కణ్మణి రాంబో ఖతీజా’ పేరుతో విడుదల చేయబోతున్నారు. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్, పాటలు అంతంత మాత్రం గానే ఉన్నా సమంత, నయన్ లకి తెలుగులో ఉన్న క్రేజ్ కారణంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 28 న ఈ మూవీ విడుదల కాబోతుంది.
2) ఆచార్య: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది. మెగా పవర్‌స్టార్ రాంచరణ్ ఈ మూవీలో మరో హీరోగా నటిస్తుండగా అతనికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ సమర్పణలో, ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్’ పతాకాల నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాంచరణ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు.
3) రన్ వే 34 : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్.అజయ్ ఈ మూవీలో పైలెట్ గా నటిస్తున్నాడు. 2015లో చోటు చేసుకున్న యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాలు :
4) గంగూబాయి కతియావాడి: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలాగే ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్ అయిన అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఇది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కింది. అజయ్ దేవగన్, హ్యూమా ఖురేషి ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ ను రాబట్టుకుంది. ఏప్రిల్ 26 నుండీ ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
5) మిషన్ ఇంపాజిబుల్: నవీన్ పోలిశెట్టితో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీని తెరకెక్కించిన స్వరూప్ ఆర్.ఎస్.జె ఈ చిత్రానికి దర్శకుడు. ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 1న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో విడుదలై ప్లాప్ అయ్యింది.అయితే ఏప్రిల్ 29 నుండీ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఇక్కడెలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.
6) 365 డేస్ : ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
7) ఓ జార్క్ : ఈ సిరీస్ కొత్త సీజన్ ఏప్రిల్ 29న నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
8) అనుపమ – నమస్తే అమెరికా : ఈ హిందీ మూవీ ఏప్రిల్ 25 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
9) నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ : ఈ హిందీ మూవీ ఏప్రిల్ 29 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
10) పాయానిగళ్ గవనిక్కవుమ్ : ఈ తమిళ మూవీ ఏప్రిల్ 29 నుండి ‘ఆహా తమిళ్’ లో స్ట్రీమింగ్ కానుంది.
11) అన్‌డన్ : ఈ కార్టూన్ సిరీస్ ఏప్రిల్ 29 నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది)
12) బేక్డ్ : ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన సీజన్ 3 ఏప్రిల్ 25 నుండీ ఊట్ లో స్ట్రీమింగ్ కానుంది
13) ది ఆఫర్ : ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 నుండీ ఊట్ లో స్ట్రీమింగ్ కానుంది (వెబ్ సిరీస్)
14) ఆక్వాఫినా ఈజ్ నోరా ఫ్రమ్ క్వీన్స్: ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 29 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది
15) బ్యారీ : ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 25 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.