సమ్మర్ హాలిడేస్ ఇంకా ముగిసిపోలేదు.కానీ పెద్ద సినిమాల జోరు ముగిసినట్టే. ఈ సెలవులను క్యాష్ చేసుకోవడానికి చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలు మిగిలాయి. వారానికి ఒకటి రెండు చొప్పున అవి వరుసగా విడుదల అవుతున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతూ ఉండగా మరికొన్ని మాత్రం ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ కు ఏమాత్రం తగ్గని విధంగా ఓటీటీ లు కూడా పెద్ద ఎత్తున ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి.
గత వారం ‘అంటే సుందరానికీ!’ వంటి మిడ్ రేంజ్ సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఓటీటీలో డాన్, కిన్నెరసాని వంటి సినిమాలు సందడి చేశాయి. ఈ వారం కూడా 10 కి పైనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.’విరాట పర్వం’ వంటి సినిమాలు థియేటర్లలో మరికొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :
1) విరాటపర్వం : రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. 1990లో నక్సలైట్ లకు.. పోలీసులకు మధ్య జరిగిన పోరు.. వాటి మధ్య చిగురించిన ఓ ప్రేమ కథ.. ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందుతోంది. ట్రైలర్ బాగుంది. కచ్చితంగా సినిమా కూడా బాగుంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. జూన్ 17న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
2) గాడ్సే : సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు. జూన్ 17న ఈ చిత్రం విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి .. కాబట్టి ఈ చిత్రం పై కూడా మంచి బజ్ ఏర్పడింది.
3) కిరోసిన్ : బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా ధృవ హీరో గా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కింది. జూన్ 17 న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు :
4) జయమ్మ పంచాయితీ : బుల్లితెర నెంబర్ 1 యాంకర్ గా రాణిస్తూనే మరోపక్క ప్రతి సినిమా వేడుకలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చిన సుమ కనకాల తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’.మే 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు మంచి పాయింట్ ను అలాగే ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని నేటివిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది ఈ చిత్రం. జూన్ 14 నుండీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.
5) రెక్కీ : శ్రీరామ్, శివ బాలాజీ కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ను పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు.7 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్… ఒక్కో ఎపిసోడ్ 25 నిమిషాల పాటు ఉంటుంది. ధన్య బాలకృష్ణ,రేఖ,ఆడుకలం నరేన్,శరణ్య ప్రదీప్ తదితరులు ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 17 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
6) O2(ఆక్సిజన్) : నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఆమె భర్త విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేశాడు. జూన్ 17నుండీ ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
7) అవతార పురుష 1 : ఈ కన్నడ చిత్రం జూన్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
8) సుజల్ : ఈ తమిళ వెబ్ సిరీస్ జూన్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
9) మాసూమ్ : ఈ హిందీ మూవీ జూన్ 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
10) ఆపరేషన్ రోమియో : ఈ హిందీ మూవీ జూన్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
11) షి : ఈ హిందీ వెబ్ సిరీస్ జూన్ 17 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
12) స్టాల్ సిటీ : ఈ హిందీ వెబ్ సిరీస్ జూన్ 16 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.