ఫిబ్రవరి ఎండింగ్ నుండీ రెండు వారాలకి ఓ పెద్ద సినిమా అన్నట్టు విడుదలవుతున్నాయి. కరోనా కారణంగా రిలీజ్ లు వాయిదా వేసుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. పెద్ద సినిమాలకు తప్ప మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలకు సోలో రిలీజ్ దొరకడం కష్టమైపోయింది. మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు అయితే ఒకే రోజు రెండు అన్నట్టు విడుదలవుతున్నాయి.వీటిలో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి తప్ప జనాలు మిగతా వాటికి టికెట్ రేట్లు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.మిగిలిన సినిమాలను ఓటీటీకి చూసుకోవచ్చని లైట్ తీసుకుంటున్నారు. ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో 2 క్రేజీ సినిమాలు ఉండగా.. మరికొన్ని ఓటీటీ వేదికగా విడుదల కాబోతున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ వంటివి కూడా సందడి చేయబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్ ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :
1) జయమ్మ పంచాయితీ : స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జయమ్మ పంచాయతీ’ చిత్రాన్ని…విజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. మే6న ఈ మూవీ విడుదల కాబోతుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.
2) భళా తందనాన : వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించే శ్రీ విష్ణు…ఈసారి ‘భళా తందనాన’ అనే మూవీతో ప్రేక్షకుల్ని అలరించనున్నాడు.’బాణం’ ‘బసంతి’ వంటి చిత్రాల దర్శకుడు చైతన్య దంటులూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మే 6నే ఈ మూవీ విడుదల కాబోతుంది. కేథరిన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
3) అశోకవనంలో అర్జున కళ్యాణం : యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీ కూడా మే 6నే ప్రేక్షకుల ముందుకు రానుంది. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించింది.
4) మా ఇష్టం(డేంజరస్) : రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇష్టం’ మూవీ కూడా మే 6నే విడుదల కాబోతుంది అంటూ రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో ప్రకటించారు. కానీ ఆ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అన్నది అనుమానమే..!
ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు :
5) చిన్ని : కీర్తి సురేష్ , సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చిన్ని'( తమిళ్ లో ‘సాని కాయిధం’) చిత్రం నుండీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.
6) రాధే శ్యామ్ : ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘రాధేశ్యామ్’ మూవీ…ఆల్రెడీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఓటిటి రిలీజ్ అయ్యింది. అయితే హిందీ వర్షన్ మే 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
7) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ : ఈ కన్నడ మూవీ మే 5 నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
8) ది వైల్డ్ : ఈ వెబ్ సిరీస్ మే 6నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
9) థార్ : ఈ మూవీ మే 6 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
10) 40 ఇయర్స్ యంగ్ : ఈ హాలీవుడ్ మూవీ మే 4 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
11) ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ : ఈ వెబ్‌సిరీస్ మే6 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
12) హోమ్ శాంతి : ఈ హిందీ వెబ్ సిరీస్ మే 6 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
13) స్టోరీస్ ఆన్‌ది నెక్ట్స్ పేజ్ : ఈ హిందీ సిరీస్ మే 6 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
14) ఝండ్ : ఈ హిందీ మూవీ మే6 నుండీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.