నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ . ‘భీష్మ’ తర్వాత నితిన్ కి సరైన హిట్టు పడలేదు. ‘చెక్’ ‘మాచర్ల నియోజకవర్గం’ వంటి సినిమాలు ప్లాప్ అవ్వగా ‘రంగ్ దే’ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇక ‘మాస్ట్రో’ ఓటీటీకి వెళ్ళింది. సో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సక్సెస్ నితిన్ కి అవసరం. ఒకవేళ ఇది మిస్ అయినా తర్వాత.. నితిన్ వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్ వంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు.
అవి మినిమం గ్యారెంటీ ప్రాజెక్టులు. ఇక వరుస సక్సెస్..లతో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీలకి కూడా ‘స్కంద’ ‘ఆదికేశవ’..ల రూపంలో రెండు ప్లాపులు పడ్డాయి. ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మినిమం గ్యారెంటీ అనిపించేవే..! కానీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ సక్సెస్’ ముగ్గురికి మాత్రం చాలా కీలకంగా మారింది. అది ఎవరికో ఇప్పుడు తెలుసుకుందాం : ముందుగా దర్శకుడు వక్కంతం వంశీకి ‘ఎక్స్ట్రా’ సక్సెస్ చాలా ముఖ్యం.స్టార్ రైటర్ గా పేరొందిన అతను దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ 2018 లో రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.
దీంతో వంశీకి రెండో సినిమా ఛాన్స్ రావడానికి చాలా టైం పట్టింది. సో ‘ఎక్స్ట్రా’ తో హిట్ కొడితేనే అతనికి వెంటనే హీరో దొరుకుతాడు. అలాగే సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ కి కూడా ‘ఎక్స్ట్రా’ సక్సెస్ చాలా కీలకం. ఎందుకంటే తమిళంలో ఇతనికి ఆఫర్లు రావడం లేదు. తెలుగులో ఇతను మ్యూజిక్ అందించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో చాలా మంది దర్శక నిర్మాతలు బ్యాడ్ సెంటిమెంట్ గా ఫీలయ్యి హారిస్ ను పక్కన పెట్టేస్తున్నారు.
సో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి అంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఇక సీనియర్ హీరో రాజశేఖర్ ..ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. దీనికి ముందు రాజశేఖర్ కి స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో విలన్ ఛాన్స్ లు, పవర్ ఫుల్ రోల్స్ వచ్చాయి. కానీ దేనికి ఓకే చెప్పలేదు. (Extra Ordinary Man) ‘ఎక్స్ట్రా’ ని నమ్మి ఓకే చేశాడు. ఇది సక్సెస్ అయితేనే అతనికి పెద్ద సినిమాల్లో ఛాన్సులు వస్తాయి.