Bigg Boss 5 Telugu: 9వ వారం నామినేషన్స్ లో ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారా..?

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ లో ఒక్క కెప్టెన్ తప్పితే, అందరూ నామినేట్ అయ్యారు. ఇందులో హౌస్ లో 10మంది ఏకంగా నామినేట్ అవ్వడం విశేషం. ఒక్క ఓటు వచ్చిన విశ్వ, అనీమాస్టర్ లు సైతం నామినేషన్స్ లోకి వచ్చేశారు. అయితే, దీని తర్వాత నామినేషన్స్ లో ఉన్నవాళ్లు సురక్షితులు అయ్యేందుకు బిగ్ బాస్ ఒక టాస్క్ ద్వారా హౌస్ మేట్స్ కి అవకాశం కల్పించాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న డెన్ లోకి తమ ఫోటోస్ ఉన్న బ్యాగ్స్ తప్పించి , వేరేవాళ్ల ఫోటోస్ ఉన్న బ్యాగ్స్ ని తీస్కుని ముందుగా వెళ్లాలి. అప్పుడు బ్యాగ్స్ తీస్కుని వెళ్లిన వాళ్లు సేఫ్ అవుతారు. బ్యాగ్ పైన ఎవరి ఫోటో ఉంటుందో వాళ్లు సురక్షితులు అవుతారు.

ఎవరి బ్యాగ్ అయితే లాస్ట్ లో తీస్కుని వచ్చారో వాళ్లు నామినేట్ అవుతారు. ఇలా ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక్కడ ఈ గేమ్ లో చివరి వరకూ అనీమాస్టర్ సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అనీమాస్టర్ బ్యాగ్ ని లాస్ట్ వరకూ మానస్ కాపాడినట్లుగా సమాచారం. అయితే, ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. అనీమాస్టర్ దగ్గర ఉన్న పవర్ షీల్డ్ ద్వారా హౌస్ లో ఇంకొకరికి ఇమ్యూనిటీని ఇవ్వచ్చని చెప్పాడు. దీంతో మానస్ తనకి హెల్ప్ చేశాడు కాబట్టి, మానస్ ని కాపాడుకుంది అనీమాస్టర్.

అంతేకాదు, లాస్ట్ టైమ్ లెటర్స్ టాస్క్ వచ్చినపుడు కూడా తన లెటర్ ని ఇచ్చి మానస్ నామినేట్ అయ్యాడు. ఇప్పుడు పే బ్యాక్ గా ఇది తిరిగి ఇచ్చేసింది అనీమాస్టర్. సో, ఈవారం వీరిద్దరు ఇంక నామినేషన్స్ లో లేనట్లే లెక్క. అనీమాస్టర్, మానస్ ఇద్దరూ సేఫ్ అయ్యారు. అదీమేటర్.

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus