Anushka Shetty: ఆ రెండు సినిమాలు చేయకపోతే అనుష్క మరో స్థాయిలో ఉండేవారా?

సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క (Anushka Shetty) అప్పటినుంచి ఇప్పటివరకు వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty) సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న అనుష్క క్రిష్ (Krish Jagarlamudi) డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే అనుష్క తన సినీ కెరీర్ లో రెండు సినిమాలలో నటించి తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ సినిమాలలో ఒక సినిమా ఒక్క మగాడు (Okka Magaadu) కాగా మరో సినిమా సైజ్ జీరో (Size Zero) కావడం గమనార్హం. అనుష్క కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నా ఈ రెండు సినిమాల వల్ల అనుష్క ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక్క మగాడు సినిమాలో అనుష్క రోల్ సరిగ్గా క్రియేట్ చేయలేదు. ఈ సినిమాలో అనుష్క పాత్ర విషయంలో ఎన్నో నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ఈ సినిమాకు అనుష్క ఓకే చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


సైజ్ జీరో సినిమాలో నటించడం అనుష్క బరువు పెరగడం వల్ల బరువు తగ్గడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అనుష్క బరువు తగ్గినా ఆమె ముఖంలో మునుపటి గ్లో లేదని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అనుష్కకు సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సైతం అనుష్కకు ఆఫర్లు వస్తుండటం గమనార్హం.


అనుష్క రెమ్యునరేషన్ పరంగా కూడా చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే టాప్ లో ఉన్నారు. అనుష్క నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనుష్క సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అనుష్క భవిష్యత్తులో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus