Prabhas: మారుతి – ప్రభాస్‌ సినిమా రూమర్ల లెక్క ఇదీ!

ప్రభాస్‌ – మారుతి కాంబినేషన్‌లో సినిమా అంటూ… గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇరు వర్గాల నుండి సరైన సమాచారం లేనప్పటికీ, ఎవరూ కొట్టిపారేయడం లేదు కూడా. అయితే సినిమా పనులు మొదలయ్యాయి అని టాక్‌ వస్తుండటంతో… డార్లింగ్‌ – మారుతి సినిమా పక్కా అనేసుకుంటున్నారు. ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా కాన్సెప్ట్‌, కథలు, బడ్జెట్‌, వర్కింగ్‌ డేస్‌ అంటూ రకరకాల ముచ్చట్లు వినిపిస్తున్నాయి. వాటి సంగతి ఓసారి చూద్దాం.

* వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తుండటంతో ప్రభాస్‌ ఓ టాలీవుడ్‌ సినిమా చేయాలని అనుకున్నారట. అందుకే మారుతి సినిమా చేస్తున్నారట.

* బయట చెప్పుకుంటున్నట్టు ఈ సినిమా హారర్‌ కామెడీ కాదట. దీన్ని పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా రూపొందిస్తున్నారని సమాచారం.

* ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారట. వారంతా ప్రభాస్‌తో గతంలో నటించనివాళ్లే అని సమాచారం.

* ముగ్గురు కథనాయికల్లో ఒకరు రాశీ ఖన్నా అనే పేరు కూడా వినిపిస్తోంది. ఆమెతోపాటు మెహరీన్‌ కూడా ఉంటుందని సమాచారం. మూడో నాయిక ఎవరు అనేది చూడాలి.

* సినిమాను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభాస్‌ లంకె పెట్టాడట. అంటే మిగిలిన పాన్‌ ఇండియా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి ఈ సినిమా పూర్తి చేస్తారట.

* ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని సమాచారం. అయితే ఆ ప్రొడక్షన్‌ హౌస్‌తోపాటు యూవీ క్రియేషన్స్‌ కూడా ఉంటుందట.

* సినిమాకు సంబంధించి ఇప్పటికే సంగీత దర్శకుడు కూడా ఫిక్స్‌ అయ్యాడట. పాటలు పనిలో ఉన్నారని టాక్‌.

* సినిమాను ఎక్కువ శాతం తెలుగు రాష్ట్రాల్లోను, సెట్స్‌లోనే పూర్తి చేయాలని చూస్తున్నారట. దాని వల్ల సమయం కలిసొస్తుందని టాక్‌.

* సినిమా విడుదలకు సిద్ధమయ్యాక అవసరమైతే సినిమాను ఇతర భాషల్లోకి డబ్బింగ్‌ చేసే ఉద్దేశంలో ఉన్నారట.

* త్వరలోనే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.

* లో ప్రొఫైల్‌గా సినిమా పనులు అంతా ముగించాలని చూస్తున్నారట. దీని వల్ల సినిమా మీద హైప్‌ రాకుండా ఉంటుందని ప్రభాస్‌ టీమ్‌ భావిస్తోందట.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus