The Rajasaab: ‘ది రాజా సాబ్’లో కథలో ట్విస్ట్ ఏమిటంటే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ (The Rajasaab)  సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మారుతి (Maruthi Dasari)  దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ హర్రర్ కామెడీ మూవీ ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. సాధారణంగా మాస్, యాక్షన్ జోనర్‌లో ఎక్కువగా కనిపించే ప్రభాస్.. ఈసారి హర్రర్ టచ్‌తో కామెడీ జోనర్‌లో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ హైప్‌ క్రియేట్ చేశాయి.

The Rajasaab

ముఖ్యంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదలైన మోషన్ పోస్టర్ అభిమానులకు కిక్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్, ఊహించని విధంగా రాజవారిగా ఒక వృద్ధుడి గెటప్‌లో కనిపించడంతో, ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా, ప్రభాస్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తూ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారనే టాక్ ఉన్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆయన మూడు భిన్న గెటప్స్‌లో దర్శనమివ్వబోతున్నారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో కంప్లీట్ గా రాజ్ సాబ్ రాజ్యం హైలెట్ అవుతుందట.

ఇక ప్రస్తుత కాలంలో స్టైలిష్ యంగ్ రెబల్ స్టార్ దర్శనమివ్వనున్నాడు. తాత మనవాళ్ళుగా ప్రభాస్ రోల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక రాజా సాబ్ ఆత్మ గెటప్ లో ప్రభాస్ లుక్ నిన్న విడుదల చేసిందే. సెకండ్ హాఫ్ మాత్రం ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దర్శకుడు మారుతి తనదైన శైలిలో హర్రర్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించేలా స్క్రిప్ట్‌ను తయారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం మార్చి 2025లో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

థమన్ (S.S.Thaman) సంగీతం అందిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్(Malavika Mohanan)  , రిధి  (Riddhi Kumar)  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తానికి ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నారని వస్తున్న టాక్ అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి డార్లింగ్ ఎంతవరకు మెప్పిస్తారో తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

ఈ సినిమాతో అయినా ఆ సీనియర్ హీరోయిన్ కి బ్రేక్ వస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus