Prabhas: ప్రభాస్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోన్న రేర్ ఫోటో..!

హీరోలు, హీరోయిన్లు రేర్ ఫోటోలు వైరల్ అవుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. గతేడాది కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఈ ఫోటోలు మరింత ఎక్కువయ్యాయి. ‘త్రో బ్యాక్’ అంటూ కొన్ని ఫోటోలను సెలబ్రిటీలు పోస్ట్ చెయ్యడం.. వారి అభిమానులు వాటిని వైరల్ చేస్తుండడం మనం చూస్తూనే వచ్చాము. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కూడా అదే విధంగా తమ అభిమాన హీరో రేర్ పిక్ ను వైరల్ చేస్తున్నారు. ఆ పిక్ లో ప్రభాస్ విశ్వామిత్రుడిగా కనిపిస్తుండటం విశేషం.

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ఈ ఫోటోని బాలీవుడ్ ప్రేక్షకులు సైతం వైరల్ చేస్తుండడం విశేషం. అసలు ఈ పిక్ ఎప్పటిది.. ఏ సినిమాకి సంబంధించినది అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా ‘యమదొంగ’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రభాస్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. మేటర్ ఏంటంటే ‘విశ్వామిత్ర క్రియేషన్స్’ పై రాజమౌళినే ‘యమదొంగ’ చిత్రాన్ని నిర్మించాడు.

అయితే మూవీ ప్రారంభంలో విశ్వామిత్ర లోగోకి గాను రాజమౌళి.. ప్రభాస్ నే చూజ్ చేసుకున్నాడు. ఆ లోగో కోసం ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో దిగిన ఫోటో ఇది. విశ్వామిత్ర మునీశ్వరుడిగా ప్రభాస్ ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ కి ‘యమదొంగ’ కంబ్యాక్ మూవీ.దీనికి ముందు ఎన్టీఆర్ కు చాలా ప్లాప్ లు పడ్డాయి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus