విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ (F2 Movie) , ‘ఎఫ్ 3’ (F3 Movie) వంటి సూపర్ హిట్ల తర్వాత రూపొందుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) . వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు.’శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. దర్శకుడు అనిల్ రావిపూడినే ఈ చిత్రానికి రూ.30 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు.
వెంకటేష్ రూ.20 కోట్ల వరకు అందుకుంటున్నాడు అని సమాచారం. వీళ్ళ పారితోషికాలతోనే సినిమా బడ్జెట్ రూ.50 కోట్లు అయిపోతుంది. ఇక మేకింగ్ కాస్ట్, మిగిలిన క్యాస్టింగ్ రెమ్యునరేషన్స్.. వంటివి అన్నీ కలుపుకుంటే ఇంకో రూ.50 కోట్లు అవుతుంది అని వినికిడి. సంక్రాంతికి కరెక్ట్ గా సెట్ అయ్యే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా థియేటర్ కి వచ్చి చూస్తారు.
సంక్రాంతి ముగిశాక కూడా ఈ సినిమా హవా ఇంకో వారం రోజులు నడిచే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయని వినికిడి. ఈ సినిమాకి థియేట్రికల్ డీల్స్ రూ.75 కోట్ల వరకు వచ్చాయట. నాన్ థియేట్రికల్ రైట్స్ ఇంకో రూ.30 కోట్లు వచ్చినా..
నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్స్ దక్కినట్టే..! సో ఏదేమైనా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బిజినెస్ పరంగా చూసుకుంటే దిల్ రాజు సేఫ్ అనే చెప్పాలి. ఇక సినిమాకి ఓ మాదిరి టాక్ వచ్చినా .. కలెక్షన్లు ఎక్కువగానే వస్తాయి. రాంచరణ్ (Ram Charan) , బాలకృష్ణ(Nandamuri Balakrishna)..ల సినిమాలు పోటీగా రిలీజ్ అవుతున్నప్పటికీ ఈ రేంజ్లో బిజినెస్ ఆఫర్స్ రావడం అంటే మామూలు విషయం కాదు.