టాలీవుడ్ బాక్సాఫీస్ మొత్తానికి ఒక ట్రాక్ లోకి వచ్చేసింది. దాదాపు 8 నెలల పాటు ఎలాంటి ఆదాయం లేకుండా ఉన్న చిత్ర పరిశ్రమ ఇప్పుడు మంచి బాక్సాఫీస్ హిట్స్ తో పూర్వ వైభవాన్ని అందుకుంటోంది. సంక్రాంతికి మాస్ రాజా క్రాక్ సినిమా వచ్చి మంచి బూస్ట్ ఇవ్వగా.. మొన్న వచ్చిన ఉప్పెన కూడా మరో బలమైన నమ్మకాన్ని ఇచ్చింది, లాక్ డౌన్ తరువాత ఎవరు ఊహించని విధంగా టికెట్ రేట్లు పెంచిన విషయం తెలిసిందే.
50% అక్యుపెన్సీ తో థియేటర్స్ నడిచాయి కాబట్టి పెంచారు అనుకుంటే పొరపాటు లేదు. కానీ ఇప్పుడు జనాలు వస్తున్నా కూడా అదే ఫ్లో కొనసాగుతోంది. నితిన్ చెక్ సినిమా నుంచి రాబోయే కొన్ని ప్రముఖ సినిమాల టికెట్ రేట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్ అయితే మినిమమ్ 150 రూపాయలు. ఇక మల్టి ప్లెక్స్ అయితే 200రూపాయల వరకు టికెట్ ధరలు కోనసాగానున్నట్లు తెలుస్తోంది.
పెద్దగా ప్రచారాలు లేకుండా చాలా సైలెంట్ సినిమా ధరలను పెంచేస్తుండం సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే వైరల్ అవుతోంది. ఇలాగైతే ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లడం మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు చాలా కష్టమనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.