Acharya Ticket: ఆచార్య మూవీ మండే టెస్ట్ పాసైందా?

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే టాక్ పాజిటివ్ గా రాకపోవడంతో ఎక్కువ మొత్తం చెల్లించి ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. సోమవారం రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి.

మండే టెస్ట్ లో ఆచార్య సినిమా పాస్ కాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మండే ఎండలు ఒకవైపు ఇబ్బంది పెడుతుంటే సినిమాకు ఫ్లాప్ టాక్ రావడం మరోవైపు సినిమాకు మైనస్ అయింది. ఆచార్య ఆదివారం కలెక్షన్లు సైతం దారుణంగా ఉన్నాయని తెలుస్తోంది. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఫ్యామిలీలు సైతం ఆచార్య సినిమాపై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ రేట్లు తగ్గిస్తే మాత్రమే ఆచార్య సినిమాకు అంతోఇంతో బెనిఫిట్ కలుగుతుంది. ఇవే టికెట్ రేట్లతో సినిమాలను ప్రదర్శిస్తే మాత్రం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కనీవిని ఎరుగని స్థాయిలో నష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మెగా హీరోల నుంచి కూడా ఈ సినిమా ఫ్లాప్ కు సంబంధించి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. 2022 సంవత్సరంలోని బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఆచార్య ఒకటి కావడం మెగా ఫ్యాన్స్ ను బాధిస్తోంది.

ఆచార్య తొలిరోజే 33 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించగా ఈ సినిమాకు 50 శాతం నష్టాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చిరంజీవి, చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నా కొరటాల శివ కథ, కథనాలకు మాత్రం నెగిటివ్ మార్కులు పడుతున్నాయి. కొరటాల శివ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని తాము అస్సలు ఊహించలేదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడటం లేదు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus