Jr NTR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఈ సీన్‌ చూశాక లాజిక్‌ అస్సలు అడగొద్దు!

ఆనందిద్దాం అని సినిమాకెళ్లేవాళ్లను ఆశ్చర్యపోయేలా చేయడం ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రత్యేకత. అందుకే ఆయన సినిమాలో ఏ ఫ్రేమ్‌ను కూడా మిస్‌ కావొద్దు అంటుంటారు. విజువల్స్‌ పరంగా కానీ, ఎమోషన్స్‌ పరంగా కానీ ఏదో ఒక మేజిక్‌ కనిపిస్తుంటుంది ఆయన సీన్స్‌లో. ఇటీవల ఆయన నుండి వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఇలాంటి సీన్స్‌ చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అందుకే సినిమా అంతటి విజయాన్ని అందుకుంది. అలాంటి సీన్స్‌లో బ్రిటిష్‌ కోటపైకి ఎన్టీఆర్‌ క్రూరమృగాలు, జంతువులతో దాడి చేయడం ఒకటి.

ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా థియేటర్లలో విడుదలవుతున్నప్పుడు రాజమౌళి అండ్‌ టీమ్‌ భారీగా ప్రమోషన్స్‌ చేసింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతుండటం, అందులోనూ రెండు ఓటీటీల్లో వస్తుండటంతో ఆయా ఓటీటీలు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. సినిమాలోని కీలక సన్నివేశాలను, ఆసక్తికరమైన సన్నివేశాలను యూట్యూబ్‌లో కొంతవరకు కట్‌ చేసి విడుదల చేస్తున్నారు. అలా నెట్‌ఫ్లిక్స్‌ టీమ్‌ బ్రిటీష్‌ కోటపై భీమ్‌ అలియాస్‌ ఎన్టీఆర్‌ దాడి చేసిన సీన్‌ను విడుదల చేసింది.

రకరకాల జంతువులను ఒకేసారి చూపించి ఆశ్చర్యచకితుల్ని చేసిన ఆ సీన్‌ ఇప్పడు వైరల్‌గా మారింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఎన్ని సీన్స్‌కి ఫ్యాన్స్‌కి గూస్‌ బంప్స్‌ వచ్చాయో తెలియదు కానీ ఆ జంతువుల దాడి సీన్‌ మాత్రం కచ్చితంగా అదిరిపోయే ఫీల్‌ ఇచ్చింది థియేటర్లలో. సగటు సినిమా ప్రేక్షకుడు అస్సలు ఊహించని సీన్‌ అది. ఎలా రాసుకున్నారు, ఎలా తీశారు అనేది పక్కనపెడితే అంత పెద్ద స్క్రీన్‌పై ఆ సీన్‌ చూసి వావ్‌ అనని వారు లేరు.

నిజానికి ఈ సీన్‌ గురించి రాజమౌళి, రామ్‌చరణ్‌, తారక్‌ చాలా సార్లు ప్రచారంలో చెప్పారు. అయితే ఎక్కడా సీన్‌ ఏంటనేది చెప్పలేదు. వాటర్‌ గన్స్‌, ఫైర్‌, ఫైట్‌ అంటూ రకరకాలుగా హింట్స్‌ ఇస్తూ వచ్చారు. అయితే అన్నేసి జంతువుల్ని ఒకేసారి చూపిస్తామని చెప్పలేదు. యూట్యూబ్‌ ఆ సీన్‌ను మీరు కూడా చూసేయొచ్చు. అయితే ఆ వీడియో చూశాక పులులు, జింకలు ఒకే కేజ్‌లో ఎలా ఉన్నాయి అనే మాట మాత్రం అడగొద్దు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus