వారం రోజులు అయ్యింది అనుకుంటా… రవితేజ ‘టైగర్’ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యి. అంతేకాదు ఆ సినిమా టాలీవుడ్‌లో ఇబ్బందులు పెడుతుంది అని మేం చెప్పి కూడా వారం రోజులు దాటింది. ఇప్పుడు అదే జరుగుతోంది కూడా. స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ‘టైగర్.. నాగేశ్వరరావు’ అని రవితేజ ఓ సినిమా అనౌన్స్ చేశారు. అంతకుముందే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కూడా ఇదే వ్యక్తి జీవిత కథతో ఓ సినిమా ప్రకటించాడు.
అంటే సాయిశ్రీనివాస్ ముందు, రవితేజ తర్వాత అని అర్థమవుతోంది. అయితే సాయిశ్రీనివాస్ సినిమా కంటే నేనే ముందు అంటూ ఇప్పుడు రవితేజ సినిమా టీమ్ చర్చకు వస్తోంది. నాలుగేళ్ల నుండి ఈ సినిమా కథ మీద పని చేస్తున్నానని, ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు కుటుంబాన్ని కలసి అనుమతి కూడా తీసుకున్నామని ‘టైగర్’ దర్శకుడు వంశీ చెబుతున్నారు. అయితే ‘స్టూవర్ట్‌పురం దొంగ’ నిర్మాత బెల్లంకొండ సురేశ్ దానికి అంగీకరించడం లేదు.టైగర్ నాగేశ్వరరావు జీవితం పబ్లిక్ డిమైన్‌లో ఉందని…
ఎవరైనా ఆయన జీవిత కథను సినిమాగా తీసుకోవచ్చని బెల్లంకొండ సురేశ్ చెబుతున్నారు. అంతేకాదు తామే ఈ సినిమా ముందు అనౌన్స్ చేశామని, కాబట్టి ఆ సినిమా తామే తీస్తామని కూడా అంటున్నారు. దీంతో టాలీవుడ్‌లో మరోసారి ఆసక్తికర పరిణామాలు జరగబోతున్నాయి. ఓవైపు పెద్ద హీరో, పెద్ద నిర్మాత మధ్య జగడంలా ఈ సినిమా మారబోతోంది. పరిశ్రమకు ఈ పరిస్థితి ఏ మాత్రం మంచిది కాదు అనేది పరిశీలకుల అభిప్రాయం.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!