Tillu 3: ‘టిల్లు 3’లో రాధిక ఉంటుందా? నేహా శెట్టి ఏం చెప్పిందంటే?

‘డీజే టిల్లు’ (Dj Tillu) సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఎంతటి పేరు సంపాదించాడో.. నేహా శెట్టి (Neha Shetty) కూడా అంతే పేరు సంపాదించింది. ఆ సినిమాలో ఆమె పాత్ర పేరే ఆమె పేరుగా మారిపోయింది అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆమె ఎక్కడికెళ్లినా రాధిక అని పిలుస్తున్నారు జనాలు. ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) సినిమాలో కూడా ఆమెను కొద్దిసేపు చూపించారు. అయితే ఇప్పుడు మూడో ‘టిల్లు’కు మొదటి ‘టిల్లు’కి సంబంధం ఉంటుందా? రెండో ‘టిల్లు’ తెరకెక్కిన విధానం ప్రకారం అయితే మూడో ‘టిల్లు’కు మొదటి రెండు ‘టిల్లు’లకు రిలేషన్‌ కచ్చితంగా ఉంటుంది.

సినిమాకు కనెక్ట్‌ అవ్వడానికి సిద్ధు జొన్నలగడ్డ ఈ ప్రయత్నం చేస్తారు అని చెప్పొచ్చు. అయితే కొత్త ‘టిల్లు’లో మొదటి ‘టిల్లు’ హీరోయిన్‌ రాధిక అలియాస్‌ నేహా శెట్టి ఉంటుందా? ఇదే విషయంలో ఆమె దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం వచ్చింది. దాంతోపాటు ఓ డౌట్‌ కూడా వచ్చింది. రాధిక కథను సినిమా టీమ్‌ ఇంకా చెప్పాలనుకుంటే చెప్తారు. అలాగే ‘టిల్లు స్క్వేర్‌’ సినిమాలో బెంగుళూరు వెళ్లిపోతా అని రాధికతో చెప్పేస్తారు.

తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంకా ఏమీ అనుకోలేదేమో. ఒకవేళ అక్కడి నుండే సినిమా మళ్లీ స్టార్ట్‌ చేయాలి అనుకుంటే అప్పుడు కచ్చితంగా రాధిక పాత్ర వస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఈ విషయం తనకు తెలియదు అని చెప్పింది నేహా శెట్టి. బెంగుళూరు వెళ్లిపోయిన రాధిక.. నిజంగానే అక్కడ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా? అని అడిగితే.. చెప్పలేం.

టిల్లు కోసం తను మళ్లీ తిరిగి రావచ్చు అని మరో ఆన్సర్‌ చెప్పి ప్రేక్షకులను మరింత కన్‌ఫ్యూజన్‌లో పడేసింది నేహా శెట్టి. దీంతో మూడో ‘టిల్లు’ బెంగళూరు చుట్టూ తిరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి సిద్ధు మనసులో ఏముందో? ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది లాంటి విషయాలు ఇప్పటి వరకు ఎక్కడా, ఎవరూ చెప్పలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus