సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ (Tillu Square) . మల్లిక్ రామ్ (Mallik Ram), ‘డిజె టిల్లు’ కి (DJ Tillu) అ విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా..సీక్వెల్ కి మాత్రం మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు.’సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించారు. సిద్దు జొన్నలగడ్డ కథతోనే ఈ సినిమా కూడా రూపొందింది అని చెప్పాలి.
మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ లభించింది.దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మొదటి సోమవారం నాడు కూడా కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి.ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 13.85 cr |
సీడెడ్ | 3.34 cr |
ఉత్తరాంధ్ర | 3.48 cr |
ఈస్ట్ | 1.69 cr |
వెస్ట్ | 1.06 cr |
గుంటూరు | 1.46 cr |
కృష్ణా | 1.35 cr |
నెల్లూరు | 0.80 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 27.03 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.30 cr |
ఓవర్సీస్ | 9.65 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 38.98 cr (షేర్) |
‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి రూ.23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు ముగిసేసరికి ఈ సినిమా రూ.38.98 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.14.98 కోట్ల లాభాలు రాబట్టి బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) వచ్చేవరకు ‘టిల్లు స్క్వేర్’ బాగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.