Tollywood: టాలీవుడ్‌లో టైమ్‌మెషీన్‌ సినిమాల సందడి!

  • July 29, 2021 / 12:55 PM IST

తెలుగులో టైమ్‌ మెషీన్‌ సినిమా అనగానే గుర్తొచ్చే చిత్రం.. ఇంకా చెప్పాలంటే ఏకైక ‘ఆదిత్య 369’. ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్లయినా ఇంకా గుర్తుంది అంటే.. ఆ కాన్సెప్ట్‌లోని ఫ్రెష్‌నెసే కారణం. అయితే 30 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు అలాంటి సినిమా టాలీవుడ్‌లో తెరకెక్కబోతోంది. ఏకంగా ఈ కాన్సెప్ట్‌తో మూడు సినిమాలు సిద్ధమవుతున్నాయని సమాచారం. దీంతో తెలుగు ప్రేక్షకులు పాత రోజుల్లోకి వెళ్లబోతున్నారన్నమాట. ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా నందమూరి మోక్షజ్ఞ కథానాయకుడిగా ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే సినిమా తీస్తాం అని బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు.

2023లో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది అని సమాచారం. ఇంకాస్త ముందైనా రెడీ అవ్వొచ్చట. మరోవైపు ‘ప్రాజెక్ట్‌ కె’ వర్కింట్ టైటిల్‌తో రూపొందుతున్న ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ సినిమా కూడా టైమ్‌ ట్రావలర్‌ అనే సమాచారం. సోషియో ఫాంటసీ, సైన్స్‌ఫిక్షన్‌ జోనర్ల కలబోత ఈ సినిమా అట. ఈ రెండింటితోపాటు శర్వానంద్‌ కూడా ఇలాంటి ప్రయత్నమే ఒకటి చేస్తున్నాడట. కొత్త దర్శకుడితో చేయనున్న ఈ సినిమాలో హీరో..టైమ్‌ మెషీన్‌ ఎక్కి తన బాల్యంలోకి వెళ్తాడట.

ఈ క్రమంలో 90ల నాటి రోజుల్ని చూపిస్తారట. వినడానికే ఆసక్తికరంగా ఉంది కదూ. ఇక సినిమాలు సిద్ధమై వస్తే ఇంకెంత బాగుంటుందో కదా. చూద్దాం ఏ సినిమా ఎలాంటి ఫీల్‌ అందిస్తుందో.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus