ఈ జోనర్ లో సినిమా తీస్తే హిట్టు!

  • September 12, 2022 / 04:32 PM IST

సైన్స్ ఫిక్షన్ సినిమాలు హాలీవుడ్ లో ఎక్కువగా వస్తుంటాయి కానీ ఇండియాలో మాత్రం చాలా తక్కువ. అందులోనూ టైం ట్రావెల్ కాన్సెప్ట్ అంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలా అని ఈ జోనర్ లో తీసే సినిమాలు సరిగ్గా ఆడవా..? అంటే అదీ కాదు. తెలుగులో ఈ నేపథ్యంలో వచ్చిన ‘ఆదిత్య 369’ సినిమా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచింది. ఆ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది.

కొన్నేళ్ల ముందు సూర్య హీరోగా వచ్చిన ’24’ సినిమా కూడా టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ జోనర్ ను డీల్ చేయడం అంత తేలికైన విషయం కాదు. అందుకే ఎక్కువ మంది ఈ జోనర్ లో సినిమాలు తీయరు. ఇప్పుడు శ్రీకార్తిక్ అనే కొత్త దర్శకుడు శర్వానంద్ హీరోగా ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాను తెరకెక్కించారు.

ఇది టైం ట్రావెల్ నేపథ్యంలో నడిచే సినిమానే. ఇందులో ఎమోషన్స్, అమ్మ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమాకి అవే ఎలిమెంట్స్ హైలైట్ గా నిలిచాయి. వీటికి తోడు కామెడీ వర్కవుట్ కావడంతో సినిమా చూడడానికి జనాలు క్యూ కడుతున్నారు. మౌత్ టాక్ పాజిటివ్ రావడంతో వసూళ్లు పుంజుకుంటున్నాయి. లాంగ్ రన్ లో సినిమా మంచి వసూళ్లు సాధించేలా ఉంది. ఈ సినిమాతో మరోసారి టైం ట్రావెల్ కాన్సెప్ట్ హిట్ ఫార్ములా అని నిరూపించారు మేకర్స్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus