సినిమా అంటే ఎంటర్‌టేన్‌మెంట్…సినిమా అంటే ఒక మంచి ఆలోచనని అందరికీ అందించడం, సినిమా అంటే ఒక క్రేజ్…అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఎన్నో వివాదాలు ఆ సినిమాను టార్గెట్ చేసుకుంటూ మొదలవుతున్నాయి….అంతేకాకుండా సినిమా చుట్టూ, సినిమా టైటిల్ చుట్టూ వివాదాలు ఏర్పడటం ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఫక్తు కమర్షియల్ బాషలో చెప్పాలి అంటే…ఇప్పుడు ఇదో ట్రెండ్ అనే చెప్పాలి….సరే ఆ విషయాన్ని పక్కన పెడితే….అసలు విషయం ఏమిటంటే…నిన్నటి వరకూ వంగవీటి సినిమా పై పది క్యాష్ చేసుకుందాం అని అనుకున్న కొందరు ఆశావాహులు…ఇపుడు ఒక బడా సినిమా పై పడ్డారు….ఇంతకీ ఆ బడా సినిమా ఏంటి అంటే….నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా…ఇప్పుడు ఈ సినిమా టైటిల్ వివాదంలోకి ఇరుక్కుంది.
బంజారా సంఘాలకు చెందిన కొందరు ఈ సినిమా టైటిల్‌ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఆందోళనల బాట పడతామని కూడ హెచ్చరిస్తున్నారు. వీరి డిమాండ్ ప్రకారం ఈమూవీ టైటిల్ ని హథీరామ్ బాబాగా మార్చాలన్నది వారి డిమాండ్. అయితే ఎందుకింత గొడవ అంటే….బంజారా సంఘాలవాదన ప్రకారం అన్నమయ్య చరిత్రకి ‘అన్నమయ్య’ అని పేరు పెట్టారు.. ‘రామదాసు’ చరిత్రకి ‘శ్రీరామదాసు’ అని పేరు పెట్టారు. ఆ లెక్కన ‘హథీరామ్‌బాబా’ చరిత్రకి ఆ పేరే పెట్టాలి కదా ? అన్నది వారి డిమాండ్…ఇక ఇలాంటివి ఎన్నో చూసిన దర్శకేంద్రుడు, పైగా నాగ్ ఇవన్నీ లైట్ అని అంటున్నారు. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కొట్టి పారేస్తున్నారు…చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.