కేసీఆర్ బయోపిక్ కు రెడీ అయిన వర్మ

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ చేసాడు. ఆ చిత్ర ఫలితం పక్కనపెడితే… అనేక వివాదాలకు తెరలేపాడు. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ ను హైలెట్ చేస్తూ నారా, నందమూరి కుటుంబ సభ్యులని నెగెటివ్ గా చూపించి వర్మ చేసిన రచ్చ అంతా.. ఇంతా కాదు. చంద్రబాబు నాయుడు తో సహా టీడీపీ నేతలందరికీ చమటలు పుట్టించి పరుగులు పెట్టించాడు. థియేటర్లలో సినిమా రిలీజ్ కనివ్వకపోతే ‘యూట్యూబ్’ లో రిలీజ్ చేస్తానని చెప్పి వాళ్ళకి నిద్ర లేకుండా చేసాడు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధి అయిన కేసీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నానంటూ ప్రకటించేశాడు. ‘టైగర్’ అనే టైటిల్ తో..’ద అగ్రెసివ్ గాంధీ’ అనే క్యాప్షన్ తో ఈ సినిమా తియబోతున్నట్లు వర్మ తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.

మరి వర్మ తెరకెక్కిస్తున్న ఈ కేసీఆర్ బయోపిక్ లో ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. పెద్ద స్టార్ క్యాస్టింగ్ జోలికి వర్మ పోడు. కచ్చితంగా ఏ రంగస్థల నటులనో చిన్న చిన్న ఆర్టిస్టులనో పెట్టి తీసేస్తాడు. అయితే ఆ క్యాస్టింగ్ ఎలా ఉంటుంది వారి గెటప్పులు ఎలా ఉంటాయనేది చూడాలి. మరి ఈ చిత్రంతో వర్మ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో కూడా తెలియాల్సి ఉంది. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాలేదు. ఈ చిత్రాన్ని చూడాలని అక్కడ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus