Thalaivar 170: రజనీ కాంత్ సినిమా ఛాన్స్ కొట్టేసిన రావు రమేష్..!

చిత్ర పరిశ్రమలో సెపరేట్ టైమింగ్, డిక్షన్‌తో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ‘రావు రమేష్’. ఇంచు మించు ఓ మాదిరి బడ్జెట్‌తో తెరకెక్కే ప్రతి సినిమాలోనూ ఆయనకో క్యారెక్టర్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇలా తన యూనిక్ యాక్టింగ్‌తో స్టార్ నటుడిగా ఎదిగిన రావు రమేష్.. సాదా సీదా సీన్లను కూడా ఇంటెన్స్ పెర్ఫామెన్స్‌తో నిలబెట్టగలరు. అయితే రావు రమేష్ తలైవా రజని కాంత్, టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న 170 సినిమా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని తాజా సమాచారం.

దర్శకుడు జ్ఞానవేల్ ఇంతకుముందు రావు రమేష్ కి తన ‘జై భీం’ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దర్శకుడు ఒక ముఖ్యమైన పాత్రలో రావు రమేష్ మాత్రమే చేయగలరని అనుకుని, అతనికి ఈ రజినీకాంత్ సినిమాలో దర్శకుడు అవకాశం ఇచ్చినట్టుగా తెలిసింది. సినిమాలో రజినీకాంత్, రావు రమేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయని కూడా చెన్నై పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.

తమిళం బాగా వచ్చిన రావు రమేష్ ఈ సినిమాతో (Thalaivar 170) తమిళ సినిమాలలో మంచి క్యారెక్టర్ పాత్రలు వచ్చే అవకాశం ఉన్నాయి అని అంచనా. ఈ సినిమాలో లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ , మంజు వారియర్ , రానా దగ్గుబాటి , దర్శన్ వంటి స్టార్లు నటిస్తున్నారని మనందరికీ తెలిసిందే..

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus