గతంలో అయితే హీరోలు వారి సినిమాలు ప్లాప్ అని చెప్పడానికి చాలా సంకోచించే వారు. బహుశా ఆ సినిమాలు తీసిన దర్శకులు లేదా నిర్మాతలు ఫీల్ అవుతారు అనో… లేక అభిమానులు కూడా హర్ట్ అవుతారు అనో కానీ… తొందరగా బయటపడేవారు కాదు. కానీ ఇప్పుడు హీరోలు చాలా వరకూ బయటపడిపోతున్నారు. ‘మా సినిమా ప్లాప్’ అంటూ ఓపెన్ గానే ఒప్పేసుకుంటున్నారు. ఆ హీరోలు ఎవరెవరో ఓ లుక్కేద్దాం రండి :
1) పవన్ కళ్యాణ్: చాలా సందర్భాల్లో తన జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు ఫ్లాప్ అని ఫ్రాంక్ గా ఒప్పేసుకున్నాడు.
2) మహేష్ బాబు: నా ‘సైనికుడు’ సినిమా వారం రోజులు ఆడలేదు అంటూ ఓ సందర్భంలో అలాగే.. ‘ఆగడు’ వంటి సినిమా ఇచ్చి నిరాశపరిచినందుకు నా ఫ్యాన్స్ కు సారీ అంటూ ‘శ్రీమంతుడు’ ఆడియో వేడుకలో చెప్పుకొచ్చాడు.
3) నాని: ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాని సూపర్ హిట్ అంటూ ఓ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ప్రమోట్ చేస్తుంటే… ‘అంత లేదు బాబాయ్.. సినిమా సరిగ్గా ఆడలేదు.. కానీ మనసు పెట్టి తీసాం’ అంటూ ట్వీట్ వేసాడు నాని.
4) నాగార్జున: 25 ఇయర్స్ తర్వాత నాగ్ – ఆర్జీవీ కాంబో లో వచ్చిన ‘ఆఫీసర్’ సినిమా డిజాస్టర్ అని మన కింగ్ సోషల్ మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడు.
5) రామ్ చరణ్: ‘మగధీర’ తర్వాత చేసిన ‘ఆరెంజ్’ చిత్రం సరిగ్గా ఆడలేదు అని చరణ్ ఓ ఇంటర్వ్యూ లో ఒప్పుకున్నాడు. అంతే కాదు ‘వినయ విధేయ రామ’ ప్లాప్ అని కూడా నేరుగా ఒప్పుకున్నాడు.
6) రామ్: తన ‘జగడం’ సినిమా ఫ్లాప్ అని మొహమాటం లేకుండా ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు రామ్.
7) రవితేజ: తన సినిమాలు ‘నిప్పు’ ‘దేవుడు చేసిన మనుషులు’ ‘కిక్ 2’ సినిమాలు ఫ్లాప్ అని రవితేజ చాలా సందర్భాల్లో ఒప్పుకున్నాడు.
8) నితిన్: ‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి సినిమాలు ఫ్లాప్ అని డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు నితిన్.’భీష్మ’ ప్రమోషనల్స్ లో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
9) ఎన్టీఆర్: ‘టెంపర్’ ఆడియో లాంచ్ లో తన గత సినిమాలతో నిరాశ పరిచినందుకు సారీ చెప్పి… ఈసారి కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తాను అని హామీ ఇచ్చాడు ఎన్టీఆర్.
10) విజయ్ దేవరకొండ: తన ‘నోటా’ సినిమా ఫ్లాప్ అని ఓ ట్వీట్ ద్వారా ఒప్పుకున్నాడు మన రౌడీ.