మెగా హీరోతో నటించిన ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరంటే..?

సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ తర్వాత అంతలా వైరల్ అయ్యేది సినిమా వార్తలే. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌కి సంబంధించి.. అప్‌డేట్స్ దగ్గరినుండి ప్రతి చిన్న విషయాలు కూడా బాగా ట్రెండ్ అవుతుంటాయి. ఇక సెలబ్రిటీల గురించిన టాపిక్స్ గురించైతే చెప్పక్కర్లేదు. అందులోనూ హీరోయిన్ల ఫొటోషూట్స్, రేర్ పిక్స్, వాళ్లు చేసే పోస్టుల వంటివి వద్దన్నా వైరల్ అవుతుంటాయి. హీరోయిన్లు చిన్నప్పటి ఫొటోలు, వితౌట్ మేకప్ ఫొటోలు షేర్ చేశారంటే మాత్రం అంత త్వరగా గుర్తు పట్టడం కష్టం కాబట్టి నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి.

ఇప్పుడు యంగ్ బ్యూటీ డింపుల్ హయతి కూడా డీ గ్లామర్ పిక్ ఒకటి పోస్ట్ చేసింది. తీక్షణంగా గమనిస్తే కానీ ఫొటోలో ఉన్నది ఆమేనని పోల్చుకోలేం. డింపుల్ విజయవాడకు చెందిన తెలుగమ్మాయే. అక్కడ పుట్టి, హైదరాబాద్‌లో పెరిగింది. సునీల్ కుమార్ రెడ్డి ‘గల్ఫ్’ మూవీతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయిన డింపుల్.. న్యూమరాలజీ ప్రకారం తన పేరుకి హయతి అని యాడ్ చేసుకుంది. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, తమన్నా నటించిన ‘అభినేత్రి’లో ఇంపార్టెంట్ రోల్ చేసింది.

వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ లో చేసిన స్పెషల్ సాంగ్ ద్వారా కుర్రకారుకి ఫుల్ కిక్కిచ్చింది. ఈ పాట ద్వారానే తెలుగులో మంచి గుర్తింపు వచ్చిందామెకి. తర్వాత తెలుగులో ‘యురేకా’ మూవీ చేసింది. ధనుష్, సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన ’అత్రాంగి రే’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చేసింది గెస్ట్ రోల్ అయినా ఆకట్టుకుంది. ఈ ఇయర్‌లో డింపుల్ హీరోయిన్‌గా చేసిన విశాల్ ‘సామాన్యుడు’, రవితేజ ‘ఖిలాడి’ సినిమాలు విడుదలయ్యాయి.

ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపిచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్‌లో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిలింలో ఛాన్స్ కొట్టేసింది. అయితే తను రీసెంట్‌గా షేర్ చేసిన ఫొటోలో మేకప్ లేకపోవడం వలన నెటిజన్లు త్వరగా గుర్తుపట్టలేకపోతున్నారు. ఒక డీ గ్లామర్ పిక్‌తోనే ఇంత హంగామా చేసిన ఈ బ్యూటీ షేర్ చేసే గ్లామరస్ ఇమేజెస్ చూస్తే కుర్రాళ్లకి మతిపోవడం ఖాయం..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus