భర్తపై హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్!

‘నువ్వు నేను’ సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ అనిత ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. భర్త రోహిత్ రెడ్డిని సరదాగా ఆటపట్టించే వీడియోలు, తన ముద్దుల కొడుకు ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన భర్తను ఆటపట్టిస్తూ అనిత షేర్ చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

తన భర్తతో కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నన్ను ఏడిపించేది నువ్వే. అయినా సరే నీ ప్రతీ చిరాకు మూమెంట్ లో నేను నీతోనే ఉండాలనుకుంటున్నా’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసింది. 2013లో రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనితకు ఇటీవల మగబిడ్డ జన్మించాడు. అందుకే ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కొడుకు మీదే పెట్టాలనుకుంటున్నట్లు ఇటీవల అనిత చెప్పింది. అలా అని నటనకు దూరం కానని.. ప్రస్తుతానికి మాత్రం తన మొదటి ప్రయారిటీ కొడుకే అని చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Share.