కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith) తెలుగు స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో చేసిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ‘మార్క్ ఆంటోనీ’ ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్ అతి కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. దీంతో డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి.
ప్రియా ప్రకాష్ వారియర్, అర్జున్ దాస్..ల ‘సుల్తానా’ సాంగ్ కూడా సినిమాకి కొంత ప్లస్ అయ్యింది.సినిమాను కనుక ఇంకాస్త బాగా ప్రమోట్ చేసుంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యి ఉండేది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.70 cr |
సీడెడ్ | 0.75 cr |
ఆంధ్ర(టోటల్) | 1.25 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.70 cr (షేర్) |