సినిమా మొదలైనప్పుడు మంచి బజ్ ఉన్నప్పటికీ.. అనంతరం జరిగిన కొన్ని మార్పుల కారణంగా ఎందుకనో మెల్లమెల్లగా హైప్ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడం అనేది మెయిన్ మైనస్ గా మారింది. అలాంటి సినిమా ట్రైలర్ వస్తుందంటే ఎందుకో సరైన బజ్ కూడా లేకుండాపోయింది. మరి ఎలాంటి అంచనాలు లేకపోవడం వల్లనో ఏమో కానీ.. “హరిహర వీరమల్లు” (Hari Hara Veeramallu) ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది.
సాధారణంగా ట్రైలర్ అంటే ఏదో కొన్ని హీరోయిక్ షాట్స్ పెట్టేస్తుంటారు. కానీ.. “హరిహర వీరమల్లు” (Hari Hara Veeramallu) విషయంలో మాత్రం స్టోరీ స్ట్రక్చర్ ఏంటి అనేది క్లారిటీగా చెప్పడం బాగుంది. అలాగే.. ట్రైలర్ లో గ్రాండియర్ కనిపించింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బాబీ డియోల్ (Bobby Deol) స్క్రీన్ ప్రెజన్స్ బాగుండగా.. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కావాల్సిన గ్లామర్ యాడ్ చేసింది. వీటన్నిటినీ కీరవాణి తనదైన శైలి బీజీయంతో ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది.
ముఖ్యంగా.. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన “మేకలు తినే పులి కాదు.. పులుల్ని వేటాడే బెబ్బులి” అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఒకటి, పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్ ఇస్తూ బాబీ డియోల్ చెప్పే “ఆంధీ వస్తుంది” డైలాగ్ కానీ ట్రైలర్ కి మంచి హై ఇచ్చాయి. ముఖ్యంగా 3 నిమిషాల ట్రైలర్ లో 140 షాట్స్ పెట్టడం అనేది మరో ప్లస్.
మరి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ట్రైలర్ లో మైనస్ ఏమీ లేవా అంటే.. సీజీ అనే చెప్పాలి. ఎక్కువ షాట్స్ తో దొరక్కుండా మ్యానేజ్ చేసినప్పటికీ.. ఆ సీజీ షాట్స్ క్వాలిటీ మాత్రం కాస్త తేలిపోయింది. అయితే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్క్రీన్ ప్రెజన్స్ & కీరవాణి సంగీతం ఆ మైనస్ పాయింట్ ను పెద్దగా పట్టించుకోనివ్వలేదు. ఈ ట్రైలర్ తో మంచి అంచనాలు నమోదయ్యాయనే చెప్పాలి. సినిమా కంటెంట్ మొత్తం ఇదే స్థాయిలో ఉంటే పవన్ కల్యాణ్ కెరీర్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉంది.