ఆగష్ట్ 13న పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని.. ఇప్పుడు బయటపెట్టింది ఓ టాలీవుడ్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? 2012 లో త్రినాథ్ రావ్ నక్కిన డైరెక్షన్లో వచ్చిన ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. తనీష్ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది కూడా..! ఇందులో హీరోయిన్ గా నటించిన నీతి టేలరే సీక్రెట్ గా పెళ్లి చేసుకుందట. ఆ చిత్రంలో నీతి నటనను ఎవ్వరూ అంత ఈజీగా మరిచిపోలేరు.
ముస్లిం అమ్మాయిగా ఎంతో సహజంగా నటించింది ఈ బ్యూటీ. ఆ చిత్రం తరువాత ఈమె ‘పెళ్లి పుస్తకం’ అనే మరో చిత్రంలో కూడా నటించింది. కానీ అది ఫ్లాప్ అయ్యింది.దాంతో ఈమె మరో సినిమా చెయ్యలేదు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈమె ఇటీవల పెళ్లి చేసుకున్నట్టు తెలిపి వార్తల్లో నిలిచింది. నీతి టేలర్ తన స్నేహితుడు పరీక్షిత్ భవను ఆగష్ట్ 13న వివాహం చేసుకుందట.తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మరియు వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈమె పెళ్లి నిరాడంబరంగా జరిగినట్టు తెలియజేసింది. ‘ఇప్పుడు నేను హేయ్ హజ్బెండ్ అని గట్టిగా అరవగలను’ అంటూ ఫన్నీ కామెంట్ కూడా పెట్టింది ఈ బ్యూటీ. ఈమె పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.