నటీమణులు తమ కెరీర్ లో అనేక పాత్రలు పోషిస్తుంటారు. కానీ కొన్ని క్యారెక్టర్లు వారి కోసమే పుట్టాయా? అన్నట్టుగా కుదిరిపోతాయి. ముఖ్యంగా హీరోయిన్ పేరు చెప్పగానే.. ఆమె పోషించిన వాటిలో ఉత్తమమైన పాత్ర పేరు మనకి గుర్తు వస్తుంది. అలా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్రలపై ఫోకస్…
అనుష్క (అరుంధతి) అనుష్క ఇప్పటికీ 40 సినిమాలకు పైగా చేసింది. వాటిలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. కానీ అనుష్క పేరుచెప్పగానే అరుంధతి సినిమానే గుర్తుకొస్తుంది. అందులో ఆమె పోషించిన అరుంధతి రోల్ స్వీటీ కి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది.
అంజలి (సీత) “ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే”.. అంటూ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అంజలి సీత పాత్రలో చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. డైలాగ్ మాత్రమే కాదు పాత్ర కూడా అందరిమదిలో నిలిచిపోయింది.
జెనీలియా (హాసిని) జెనీలియా పేరు చెప్పగానే అల్లరి పిల్ల అనే ట్యాగ్ తగిలించేస్తాం. అందుకు ప్రధాన కారణం బొమ్మరిల్లు సినిమాలో ఆమె పోషించిన హాసిని క్యారక్టరే. ఆ పాత్రలో జెనీలియా జీవించేసింది. తెలుగు వారి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.
ఇలియానా (శృతి)గోవా బ్యూటీ ఇలియానా తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి విజయాలు అందుకుంది. అయితే మహేష్ బాబు పోకిరి సినిమాలో ఆమె పోషించిన శృతి పాత్ర మాత్రం యువకులను గిలిగింతలు పెట్టింది. అందుకే ఇలియానా అంటే శృతి క్యారక్టర్ గుర్తుకు వస్తుంది.
కాజల్ (మిత్రవింద)ఒకే ఒక్క సినిమాతో కాజల్ టాలీవుడ్ యువరాణి అయిపోయింది. అదే రాజమౌళి తెరకెక్కిన మగధీర. ఇందులో కాజల్ ఇందు, మిత్రవింద అనే రెండు పాత్రలు పోషించింది. అయినా మిత్ర వింద రోల్ మాత్రం ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
సమంత (జెస్సి) కొన్ని సినిమాల తర్వాత హీరోయిన్స్ కి మంచి రోల్స్ దక్కుతాయి. కానీ సమంతకి మొదటి సినిమాతోనే మరిచిపోలేని క్యారక్టర్ దక్కింది. ఏ మాయ చేసావే సినిమాలో సమంత పోషించిన జెస్సీ రోల్ ని కుర్రోళ్ళు ఎప్పటికి మరిచిపోలేరు. తాజాగా రంగస్థలంలో రామలక్ష్మి గా అద్భుతనటన కనబరిచి గుర్తింపును తెచ్చుకుంది.
శ్రియ (అంజలి) నేటి కాలంలో ఎక్కువ ఏళ్లు తెలుగు చిత్రపరిశ్రమలో కొనసాగిన హీరోయిన్ గా శ్రియ రికార్డు సృష్టించింది. పెద్ద, చిన్న హీరోలందరితో చేసిన ఈ భామ నువ్వే నువ్వే చిత్రంలో అంజలి పాత్రలో “అమ్మ ఆవకాయ్ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు” అనే డైలాగ్ చెబుతుంది. అదే మాదిరిగా అంజలి రోల్ శ్రియ కెరీర్ లో మొదటి స్థానాల్లో నిలిచి పోయింది.
శ్వేతా బసు ప్రసాద్ (స్వప్న) ముద్దుముద్దుమాటలతో శ్వేతా బసు ప్రసాద్ మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది. కొత్తబంగారంలోకం సినిమాలో ఆమె పోషించిన స్వప్న రోల్.. కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచింది.
తమన్నా (గంగ) అందాల సుందరి పాత్రలో మెరిసిపోయే తమన్నా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో టామ్ భాయ్ గా మెప్పించింది. ఇందులో గంగ పాత్రలో విభిన్నంగా కనిపించి గుర్తింపు తెచ్చుకుంది.
త్రిష (పూరి) అతడు సినిమాలో త్రిష అమాయకత్వం నిండిన అందమైన అమ్మాయిగా ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అందుకే త్రిష పేరుచెప్పగానే అందరికీ పూరి పాత్ర గుర్తుకు వస్తుంది.
కీర్తి సురేష్ (సావిత్రి)నేను శైలజ చిత్రంతోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ అభినేత్రి సావిత్రి బయోపిక్ మహానటి మూవీలో సావిత్రిగా అమోఘమైన నటనను ప్రదర్శించింది. మరో పదేళ్ళపాటు కీర్తి పేరు చెప్పగానే సావిత్రి రోల్ ముందుగా గుర్తుకువస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.