టాలీవుడ్ లో రీమేక్ ల హవా!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కావడంతో రిస్క్ ఎక్కువ ఉండదని నిర్మాతలు భావిస్తుంటారు. రీమేక్ సినిమాలు కూడా ఎక్కువ శాతం హిట్ అవ్వడంతో నిర్మాతలకు లాభాలు బాగా వస్తున్నాయి. అందుకే ఇతర భాషల హిట్ సినిమాల రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతుంటారు. తెలుగులో విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడింది. అలానే అక్కడ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమా ‘పింక్’ రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటించడానికి కూడా పవన్ అంగీకరించాడు. అలానే నితిన్ హీరోగా బ్లాక్ బస్టర్ హిందీ సినిమా ‘అంధాధున్’ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని తమిళ, మలయాళ, కన్నడ సినిమాలను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ సినిమా తమిళ చిత్రం ‘తడం’కి రీమేక్. వెంకీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘నారప్ప’ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అసురన్’ సినిమాకి రీమేక్. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అలానే చిరు తన 153వ చిత్రంగా మలయాళం సినిమా ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. కుర్ర హీరో సత్యదేవ్ నటిస్తోంది ‘తిమ్మరుసు’ సినిమా కన్నడ చిత్రం ‘బీర్బల్’కి రీమేక్. ఇదే హీరో ‘గుర్తుందా శీతాకాలం’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మరో కన్నడ సినిమా ‘లవ్ మాక్ టైల్’కి రీమేక్. యువ సంచలనం విశ్వక్ సేన్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ రీమేక్ లో నటించడానికి అంగీకరించాడు. సుమంత్ నటిస్తోన్న ‘కపటధారి’, రవితేజ ‘క్రాక్’ సినిమాలు కూడా రీమేక్ కథలే. ఈ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 – Vakeel Saab – PINK

2 – Narappa – Asuran

3 – Chiru153 – Lucifer

4 – RED – Thadam

5 – Thimmarusu -Birbal

6 – Vishwaksen – Kappela

7 – Nithiin – Andhadhun

8 – Gurtunda Seetha Kaalam – Love Mock tail

9 – Ayyappanum Koshiyum

10 – Kapatadhaari – Kavaludaari

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus