Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి వద్ద సందడి చేసిన స్టార్స్..వీడియో వైరల్!

అల్లు అర్జున్ (Allu Arjun) నిన్న రాత్రంతా చంచ‌ల్ గూడా జైల్లో గడిపి ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకొన్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బ‌న్నీని చూసి ఫ్యామిలీ అంతా.. చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ.. ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకుని ముద్దుపెట్టుకుని తన్మయత్వం పొందింది.కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్.

Allu Arjun

ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని, అండగా నిలబడతానని అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు వంటివి ఏమీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ ని పరామర్శించడానికి టాలీవుడ్లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా ‘పుష్ప’ (Pushpa) నిర్మాతలు అయినటువంటి ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు రవిశంకర్(Y .Ravi Shankar), నవీన్ ఎర్నేని(Naveen Yerneni)..లతో కలిసి దర్శకుడు సుకుమార్ (Sukumar) వెళ్లి బన్నీని కలిశాడు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత ఎస్.కె.ఎన్, (SKN) మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) , నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)…లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

గుమ్మడికాయతో దిష్టి తీసిన కుటుంబ సభ్యులు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus