Tollywood: ఐపీఎల్‌లో టాలీవుడ్‌ సందడి.. ఈసారి జోష్‌ మామూలుగా ఉండదు!

(Tollywood) క్రికెట్‌ పండగ.. ఐపీఎల్‌ త్వరలో ప్రారంభం కాబోతోంది. గత కొన్నేళ్లుగా కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితులతో ఈ టోర్నీలో ఆసక్తికరంగా మొదలవ్వలేదు, అలానే సాగలేదు కూడా. అయితే ఇప్పుడు పరిస్థితులు అదుపులో ఉండటంతో గతంలో జరిగినట్లుగా భారీగా నిర్వహించాలని ఫిక్స్‌ చేశారు. దీని కోసం టోర్నీ ప్రారంభం రోజున అంటే మార్చి 31న భారీ ఎత్తున ఓపెనింగ్‌ ఫంక్షన్‌ చేద్దామని అనుకుంటున్నారు. అంతే సంగీతం, తారల నృత్యాలు.. ఇలా నాటి బజ్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట.

దీని కోసం ఈసారి బాలీవుడ్‌ నుండి కాకుండా టాలీవుడ్ హీరోయిన్లను ఎంచుకున్నారని సమాచారం. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌ ప్రారంభంలో బాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్లు వచ్చి డ్యాన్స్‌లు చేయడం అలవాటు. స్టార్‌ హీరోయిన్లు చాలామంది ఇలా మెరిసినవాళ్లే. అయితే ఈసారి నేషనల్‌ క్రష్‌ని ఈవెంట్‌ తీసుకొస్తున్నారట. అలాగే మిల్కీ బ్యూటీ కూడా డ్యాన్స్‌ చేస్తుంది అని చెబుతున్నారు. సౌత్‌లో క్రికెట్‌కు ఉన్న ప్రాముఖ్యత, అలాగే ఆ నటీమణులు బాలీవుడ్‌లో కూడా పరిచయం ఉండటం కారణంగా వీళ్లు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు.

అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్‌,చెన్నై మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌తో ఈ టోర్నీ ఓపెన్‌ అవుతుంది. ఆ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందులో రష్మిక మందన, తమన్నా డ్యాన్స్‌ చేస్తారని సమాచారం. వీరిద్ద‌రూ స్టేజీపై టాలీవుడ్ హిట్ పాట‌ల‌కు డాన్స్ చేస్తార‌ని అంటున్నారు. దీని కోసం ర‌ష్మిక ఇప్ప‌టికే రిహార్స‌ల్స్ కూడా మొద‌లెట్టేసింద‌ని తెలుస్తోంది. అలాగే స్టేజీ పెర్‌ఫార్మ్సెన్స్‌ కోసం ఈ క‌థానాయిక‌లిద్ద‌రూ భారీ మొత్తంలో పారితోషికం అందుకోబోతున్నార‌ని తెలుస్తోంది.

రష్మిక ప్రస్తుతం ఎక్కడకెళ్లినా ‘సామి సామి..’ పాటకు కచ్చితంగా డ్యాన్స్‌ చేస్తుంది. ఐకానిక్‌ హిప్‌ స్టెప్‌ ఎన్నిసార్లు వేసినా… అభిమానులు హ్యాపీగా ఫీల్‌ అవుతారు. కాబట్టి ఆ పాటను ఈసారి ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. అలాగే ‘స్వింగ్‌ జరా’ పాటకు తమన్నా స్టెప్పులు కూడా చూడొచ్చు అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus