Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై దర్శకుడి వ్యాఖ్యలు!

సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి రకరకాల విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. తాగి డ్రైవ్ చేశాడని రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే రోడ్డు మీదున్న ఇసుక వల్ల స్కిడ్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై ఓ సెక్షన్ మీడియా చేస్తోన్న అతిపై దర్శకుడు సాయి రాజేష్ ఘాటుగా స్పందించారు.

‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ వంటి సినిమాలు తీసిన మెగా అభిమాని సాయి రాజేష్ స్పందించారు. ‘సోషల్ మీడియా, CCTV footage ఉన్న రోజుల్లో ఈ ఆక్సిడెంట్ జరిగింది.లేకపోయి ఉండుంటే ఏం జరిగేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రక్తం లో ఆల్కహాల్ ఎంత ఉంది అని ప్రభుత్వ కాంపౌండర్ దగ్గర ఒక బులెటిన్, స్పీడ్ 180 అని స్పోర్ట్స్ బైక్ నిపుణుడి దగ్గర ఒక విశ్లేషణ. జీవిత కాలం పట్టేది మచ్చ పోవటానికి’ అంటూ మీడియాపై సెటైర్ వేశాడు.

ఈ పోస్ట్ కి మెగాఅభిమానుల నుండి భారీ మద్దతు వస్తోంది. స్పీడ్ గురించి వస్తోన్న వార్తలను మెగాభిమానులు తిప్పి కొడుతున్నారు. కొందరు 180కిమీ వేగం అని రాస్తున్నారంటూ మండిపడుతున్నారు. మంత్రి తలసాని కూడా ఈ అసత్య ప్రచారాలు ఆపాలంటూ సూచించారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus