కోలీవుడ్ స్టార్ హీరోలనే నమ్ముకుంటున్న టాలీవుడ్ దర్శకులు..!

టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడు అస్సలు ఖాళీగా లేరు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. వంటి స్టార్ హీరోలు ఒక్కొక్కరూ రెండేసి ప్రాజెక్టులకు సైన్ చేసి వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో తెలుగులో బ్లాక్ బస్టర్లు కొట్టి స్టార్ స్టేటస్ దక్కించుకున్న యంగ్ డైరెక్టర్లకు మళ్ళీ మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం ఇష్టం లేక ఏమో కానీ తమిళ స్టార్ హీరోల వద్దకే పరుగులు తీస్తున్నట్టు వినికిడి.

‘జాతి రత్నాలు’ వంటి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అనుదీప్… లాటరీలో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ను పట్టేశాడు. కానీ ‘ప్రిన్స్’ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినా సరే అనుదీప్ తో సినిమా చేయడానికి కోలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. అలాగే వంశీ పైడిపల్లి… విజయ్ తో ‘వరిసు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో మళ్ళీ వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి విజయ్ రెడీ అవుతున్నాడట.

వంశీ కూడా విజయ్ తోనే సినిమా చేయాలని రెడీ అవుతున్నాడు. అంతేకాని తెలుగులో మిడ్ రేంజ్ హీరోని డైరెక్ట్ చేయాలని చూడటం లేదు. ఖాళీ దొరికినప్పుడల్లా చెన్నై వెళ్లి విజయ్ ను కలిసొస్తున్నాడని వినికిడి. ఇక ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ కూడా ఇంతే..! మహేష్ బాబుతో సినిమా చేశాక నాగ చైతన్యతో సినిమా చేద్దాం అనుకున్నాడు. కానీ అది సెట్ అవ్వలేదు. విజయ్ దేవరకొండతో సినిమా అనుకుంటే ఇక్కడి బడా నిర్మాత అడ్డుపడ్డాడు.

దీంతో మరో మిడ్ రేంజ్ హీరో జోలికి పోకుండా చెన్నై వెళ్లి కార్తీని ఒప్పించేశాడు. ఈ ప్రాజెక్టు దాదాపు ఫిక్స్ అయిపోయింది. చెన్నైలోనే స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టాలని పరశురామ్ భావిస్తున్నాడు. ఇలా ఇక్కడి స్టార్ హీరోలు ఖాళీ లేకపోవడంతో కోలీవుడ్ స్టార్ హీరోల కోసం పడిగాపులు కాస్తున్నారు మన దర్శకులు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus