కరోనా సమయంలో ఓటీటీలకు విపరీతమైన ఆదరణ వచ్చింది. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా థియేటర్లు మూతపడటంతో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలలో ప్రసారమవుతో ప్రేక్షకులను సందడి చేశాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం థియేటర్లో విడుదలైన ప్రతి ఒక్క సినిమా కూడా ఓటీటీలలో విడుదలవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే ఇలా ఓటీటీలకు మంచి ఆదరణ రావడంతో నిర్మాతలకు ఒక విధంగా లాభం అయినప్పటికీ మరోవైపు నష్టాన్ని కూడా కలిగిస్తుంది.
ప్రస్తుతం థియేటర్లో ఒక సినిమా విడుదలైన నాలుగు వారాలకే ఆ సినిమాను ఓటీటీలలో విడుదల చేయటం వల్ల చాలామంది ప్రేక్షకులు సినిమాని థియేటర్లో చూడటానికి ఇష్టపడటం లేదు. అదే కాకుండా ప్రస్తుత సినిమా టికెట్ల రేట్లు కూడా భారం కావడంతో చాలామంది సినిమాలను థియేటర్లో చూడటం కన్నా ఓటీటీలలో చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విధంగా ప్రేక్షకులు సినిమా చూడటానికి థియేటర్ కి రాకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలు ఎదురవుతున్నాయి.
ఇలాంటి నష్టాల నుంచి బయటపడటానికి నిర్మాతలు అందరూ కలిసి సినిమాలను ఓటీటీలలో విడుదల చేసే విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాతలందరూ ఓటీటీలలో సినిమాల విడుదల విషయంపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జులై 1వ తేదీ నుంచి విడుదల కాబోయే ప్రతి ఒక్క సినిమా థియేటర్లలో విడుదలయ్యి 50 రోజులు పూర్తి చేసుకున్న తరువాతనే ఓటీటీలలో విడుదల చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడించనున్నారు. ఇకపై థియేటర్లో విడుదలైన 50 రోజుల తరువాతనే మనం ఆ సినిమాలను ఓటీటీలలో చూసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!