Baby Movie: ఆ హీరో ఈ పాత్ర ఒప్పుకోక పోవడమే సరైనదని అంటున్న అభిమానులు!

కూల్ అండ్ రొమాంటిక్ బాయ్ గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పరిచయం అయిన అభిజిత్… బిగ్ బాస్ సీజన్ ఫోర్ తర్వాత బాగా ఫేమస్ అయ్యాడు. నిజానికి అభిజిత్ ఆలోచనలకు, తను ఆడిన విధానానికి, భిన్నత్వాన్ని, మచ్యూరిటీకి, చాలా మంది ఫ్యాన్స్ ను తన సొంతం చేసుకున్నాడు. అలా తన ఫేమస్ ను దృష్టి పెట్టుకుని… బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ అభిజిత్ దగ్గరకి అప్రోచ్ అయ్యారు. వైష్ణవి చైతన్య డెబ్యూ ఫిలింలోనే తన నటనతో అందరి ఆదరణ పొందింది.

ఇక బేబీ సినిమా (Baby Movie) ప్రస్తుత కాలంలో… యువతకు బాగా కనెక్ట్ అవ్వడంతో హిట్ ఖాతాలోకి వెళ్ళింది. అంతే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా చిత్రీకరణకు అయిన బడ్జెట్ కంటే కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను ఒకరంగంగా వైష్ణవి చైతన్య నటనతో తన భుజాల మీద మూసిందనే ప్రశంసలు అందుకుంది. అటు ఆనంద్ దేవరకొండకు కూడా అంతక ముందు తీసిన సినిమాల కంటే కూడా ఈ సినిమా ఓ కీలక మలుపు అనే చెప్పొచ్చు.

ఇక విరాజ్ అయితే తన పాత్రకు సరిగ్గా సరిపోయాడు. మరి ఇంత హిట్ అందుకున్న ఈ కథలో విరాజ్ ప్లేస్ కి ముందు అభిజిత్ ని ఆశ్రయించారు డైరెక్టర్ సాయి రాజేష్. అభిజిత్ ను కలిసి పూర్తి స్టోరీ చెప్పిన తరువాత అభిజిత్ రిజెక్ట్ చేశారట. మరి అభిజిత్ ఆలోచనలకు తగిన క్యారెక్టర్ కాదనో… లేక ఆ పాత్రకు నచ్చకనో ఎందుకు విద్దనుకున్నాడో కారణం తెలియలేదు.

చాలా కొద్ది మంది మాత్రమే మంచి ఆఫర్ వొడులుకున్నాడని అంటున్నారు కానీ… అభిజిత్ అభిమానులు ఈ పాత్ర ఒప్పుకోక పోవడమే సరైనదని భావిస్తున్నారు. అభిజిత్ ను చూస్తే విరాజ్ పాత్రలో సరిపోతాడేమో కానీ… తన ఆలోచనా విధానానికి ఇటువంటి పాత్రలు సరి కావనే అభిప్రాయాలు కూడా వినికిడిలో ఉన్నాయి. మరి నిజంగా అభిజిత్ ఆ పాత్రలో నటించి ఉంటే సినిమా ఎలా ఉండేదో మరి.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus