ఇప్పటి రోజుల్లో హీరో, హీరోయిన్స్..కి సక్సెస్ అనేది చాలా కీలకంగా మారిపోయింది. సక్సెస్ లో ఉంటే నిర్మాతలు వీళ్లకి అడిగినంత ముట్టచెబుతారు. లేదు అంటే వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి.. ఇంకా దారుణంగా థింక్ చేస్తే వాళ్ళని సెంటిమెంట్ గా ఫీలయ్యి పక్కన పెట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇక గత ఏడాది అంటే 2025 లో చూసుకుంటే చాలా మంది ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డారు.
అలా పరాజయాలతో సతమతమైన హీరోలకు 2026 (2026 Tollywood) ‘డూ ఆర్ డై’ ఇయర్‌గా మారింది అనే చెప్పాలి. ఈ లిస్టులో చాలా మంది హీరోలు ఉన్నారు. కాకపోతే కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన స్థితిలో ఉన్న కొంతమంది హీరోలను ఓ లుక్కేద్దాం రండి :

1) చిరంజీవి : మెగా కాంపౌండ్ హీరోలూ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం రెడీ అవుతున్నారు. ‘భోళా శంకర్’ చేదు అనుభవం తర్వాత చిరంజీవి… కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అంటూ 2026 సంక్రాంతికి అంటే జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనిపై చిరు నెక్స్ట్ మూవీ ‘విశ్వంభర’ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది.జూన్‌లో వశిష్ట డైరెక్షన్‌లో ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఒడెల, బాబీలతో కూడా చిరు సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు.

2) రామ్ చరణ్ : ‘గేమ్ చేంజర్’ ఫలితంతో షాక్ తిన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది. 2026, మార్చి 27న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా చరణ్ హిట్టు కొట్టాలి. ఆ తర్వాత సుకుమార్‌తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ (RC 17) జూలైలో షూటింగ్ మొదలుకానుంది.

3)రవితేజ: ‘మిస్టర్ బచ్చన్’ ‘మాస్ జాతర’ వంటి వరుస డిజాస్టర్స్ తో మాస్ మహారాజా రవితేజ మార్కెట్ బాగా దెబ్బతింది. అందుకే రూట్ మార్చి ఫ్యామిలీ సినిమా చేశాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఆయన నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా 2026 సంక్రాంతి బరిలో నిలవనుంది. ఇది కచ్చితంగా హిట్ అవుతుందనే హోప్స్ తో రవితేజ ఉన్నాడు. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

4)విజయ్ దేవరకొండ : ‘కింగ్‌డమ్’ ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ఆశలన్నీ తన తర్వాతి ప్రాజెక్ట్‌పైనే పెట్టుకున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘రౌడీ జనార్దన’ 2026లో రానుంది. ఇది కాకుండా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అది కూడా షూటింగ్ జరుపుకుంటోంది.

5)నితిన్ : 2025లో వచ్చిన ‘రాబిన్ హుడ్’ ‘తమ్ముడు’ సినిమాలతో నితిన్ మార్కెట్ కూడా బాగా దెబ్బతింది. అందుకే నితిన్‌కి 2026 చాలా కీలకం కానుంది.

6) వరుణ్ తేజ్ : ‘ఆపరేషన్ వాలెంటైన్’ ‘మట్కా’ వంటి ఫ్లాప్స్ తర్వాత 2025లో గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో #VT15(కొరియన్ కనకరాజు(వర్కింగ్ టైటిల్)) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీంతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

7)కళ్యాణ్ రామ్ : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా హిట్టు మొహం చూసి చాలా కాలమైంది. ప్రస్తుతం ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అలాగే ‘బింబిసార 2’ కూడా ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

8) అఖిల్ అక్కినేని : ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ సినిమాలకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ‘లెనిన్’ అనే మాస్ సినిమా చేస్తున్నాడు.2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

9) శర్వానంద్: శర్వానంద్ కి కూడా 2026 చాలా కీలకం. ‘నారి నారి నడుమ మురారి’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అలాగే ‘బైకర్’ అనే రేసింగ్ డ్రామా కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.

10) గోపీచంద్ : ‘భీమా’ ‘విశ్వం’ వంటి యావరేజ్ సినిమాలతో నెట్టుకొస్తున్న గోపీచంద్ కి కూడా హిట్టు అవసరం. ప్రస్తుతం ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు.2026 లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. అలాగే యూవీ క్రియేషన్స్‌లో ఓ అడ్వెంచరస్ మూవీ కూడా చేయబోతున్నాడు.
