(Directors) సినిమా ఫీల్డ్‌లో టాలెంట్ ఉంటే చాలు.. ఎలాంటి క్వాలిఫికేషన్లూ, క్యాలిక్యులేషన్లూ అక్కర్లేదు.. మనలో విషయం ఉంటే సక్సెస్ వస్తుంది.. దాంతో ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయి.. అలాగే పరిశ్రమలో భాషా బేధం లేదు.. ఒక్క లాంగ్వేజ్‌కే పరిమితమవ్వాలనే రూల్ కూడా ఏం లేదు.. దీంతో ఇతర ఇండస్ట్రీల నుండి కూడా పిలిచి మరీ అవకాశాలిస్తుంటారు.. అలాగే ఇప్పుడు కన్నడ యువ దర్శకులు తెలుగులో స్టార్ హీరోలతో చిత్రాలు చేస్తున్నారు.. ఆ డైరెక్టర్స్, వారు తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ గురించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రశాంత్ నీల్..
కన్నడలో ‘ఉగ్రం’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్.. KGF తో ప్రపంచం చూపు కన్నడ పరిశ్రమవైపు తిప్పాడు.. సంచలనం విజయం సాధించి KGF 2 తో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ (రెండు భాగాలు) తీస్తున్నాడు.. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా కూడా రెండు పార్టులుగా రూపొందనుందని సమాచారం.. ‘సలార్’ షూటింగ్ కంప్లీట్ కాగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు..
ఎ.హర్ష..
కథా బలంతో పాటు యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తూ చిత్రాలను తెరకెక్కించి కన్నడ నాట దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎ.హర్ష.. ఇటీవల ‘కరునాడ చక్రవర్తి’ డా. శివ రాజ్ కుమార్ హీరోగా తీసిన ‘వేద’ సూపర్ హిట్ అయింది.. ఇప్పుడాయన గోపిచంద్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. గోపి నటిస్తున్న 31వ చిత్రమిది.. కె కె రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫిలిం ఇటీవలే ప్రారంభమైంది..
నార్తన్..
‘ముఫ్తీ’ సినిమాతో కన్నడ పరిశ్రమలో క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ నార్తన్.. శివ రాజ్ కుమార్‌తో చేసిన ‘భైరతి రణగల్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేయబోయే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి రాబోతున్నాడు.. చరణ్‌కి కథ చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్..