సినిమా ఇండస్ట్రీ అంటే…హీరోలకు భజన చెయ్యడం, హీరోలకు సేవలు చెయ్యడం, ఇంకా చెప్పాలి అంటే హీరోలను ఆరాధించడం షరా మామూలుగా మారిపోయింది అని చాలా సార్లు వింటూనే ఉన్నాం…అయితే దానికి కారణంలు అనేకం ఉన్నాయి….అదే క్రమంలో హీరో తీసుకునే రెమ్యునిరేషన్ బట్టి సైతం హీరో డిమాండ్ ఎంత ఉందో ఇట్టే చెప్పేయ్యవచ్చు….ఇప్పటివరకూ సినిమా సినిమాకు…తన రెమ్యునిరేషన్ ను పెంచుకుంటూ పోతూ…నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ…పండగ చేసుకుంటున్నా హీరోలకు భారీ షాక్….విషయంలోకి వెళితే….దాదాపుగా 15 కోట్ల నుండి 25 కోట్ల వరకు భారీ పారితోషికాలను పొందుతున్న కొందరు యంగ్ హీరోలు రానున్నరోజులలో తమ పారితోషికాలను ఈస్థాయిలో ప్రస్తుతం మారిన పరిస్థుతలలో పొందలేరు అని ఒక ప్రముఖ దినపత్రిక ఒక సంచలన కధనాన్ని ప్రచురించింది.
అదే క్రమంలో రాబోయేరోజులలో టాప్ యంగ్ హీరోలు కోరుకున్న విధంగా ఈభారీ స్థాయిలో అత్యధిక పారితోషికాలు ఇచ్చే స్థితిలో భారీ నిర్మాతలు ఉండరని…దాదాపు యాభై శాతం వరకు వారి పారితోషికాలలో కోతపడే అవకాశం ఉంది అని ఆపత్రిక అంచనా వేస్తోంది. ఇక రెమ్యునిరేషన్ పెంపు విషయంలోకూడా….కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం చాలా ఉంది అని తెలుస్తుంది….యంగ్ హీరోలతో సినిమాలు తీసే నిర్మాతలు కేవలం ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో మాత్రమే సినిమాలు తీయగలరనీ గతంలో లా సినిమాసినిమాకు టాప్ యంగ్ హీరోల భారీ పారితోషికాలు పెరిగే ఆస్కారం లేదని తెలుస్తుంది…..ఇక కలక్షన్స్ విషయంలో ఎటువంటి అసత్యాలు గొప్పలు ప్రచారం చేసే అవకాశాలు ఉండవని అలాచేస్తే భారీ నిర్మాతలే సమస్యలలోకి వెళ్ళిపోయే ఆస్కారం ఉంది అని వ్యాఖ్యానించింది ఆదినపత్రిక. ఇక ఈ పద్దతి….ఎప్పుడో కాకుండా….వచ్చే నెల విడుదలయ్యే ధృవ తోనే మొదలవుతుంది అని తెలుస్తుంది…మరి అదే నిజం అయితే ఇండస్ట్రీ కి గడ్డు కాలం తప్పదు అని అర్ధం అయిపోతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.