Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’కు పోటీగా ముగ్గురు హీరోలు!

  • August 18, 2022 / 02:35 PM IST

సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి మెల్లగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎలాంటి సినిమా వచ్చినా.. అది డిజాస్టర్ అవుతుంది. కనీసపు ఓపెనింగ్స్ లేక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ను ఎలా ప్రమోట్ చేయాలో తెలియక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. అందుకే రిలీజ్ కు కేవలం ఇరవై రోజుల సమయమే ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ హడావిడి కనిపించడం లేదు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యేప్పుడు దీనికి పోటీగా ఇతర సినిమాలు రావడానికి భయపడతాయి.

ఇక చిన్న సినిమాలైతే అలాంటి సాహసం చేయాలని కూడా అనుకోవు. పైగా ఈ సినిమాకి సమర్పకుడిగా రాజమౌళి వ్యవహరిస్తున్నారు. దీంతో ‘బ్రహ్మాస్త్ర’కి పోటీ ఉండదని భావించారు. కానీ అసలు ఈ సినిమా పట్టించుకుంటున్నట్లుగా కూడా లేరు మన హీరోలు. కిరణ్ అబ్బవరం నటించిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా ‘బ్రహ్మస్త్ర’కి పోటీగా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఓకే అనిపించడంతో సినిమాపై మోస్టర్లు అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఇదివరకు కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలు ప్లాప్ కావడంతో.. ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడే ఛాన్స్ ఉంది. మరో నటుడు సత్యదేవ్ నటించిన సినిమా కూడా అదే రోజు రాబోతుంది. ఎప్పటినుంచో వాయిదాల మీద వాయిదాలు పడ్డ సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఫైనల్ గా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.

ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించింది. కన్నడ సినిమా ‘లవ్ మాక్ టైల్’కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలతో పాటు శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమా కూడా అదే డేట్ కి రాబోతుంది. ఈ ముగ్గురు హీరోలు ‘బ్రహ్మాస్త్ర’తో పోటీ పడడానికి రెడీ అయ్యారంటే.. ఆ సినిమాను లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus