కృష్ణంరాజు టు శ్రీకాంత్.. హీరోల కూతుర్ల ఫోటోలు వైరల్..!

స్టార్ హీరోలు చాలా వరకు తమ ఫ్యామిలీని మీడియాకి, కాంట్రవర్సీలకి దూరంగా ఉంచాలని భవిస్తూ ఉంటారు. వారి కొడుకులు ఉంటే చదువు పూర్తయ్యాక హీరోలుగానో, నటులు గానో ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు.. కానీ కూతుర్లను మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలనే భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడి కష్టాలు అవి వాళ్లకు తెలిసుంటాయి కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం అనేది పెరిగిన తర్వాత స్టార్ హీరోలు తమ కూతుర్లను దాచాలని ప్రయత్నించినా అది వాళ్ళ చేతుల్లో లేని పనిగా అయిపోయింది.

అందులోనూ కొంతమంది హీరోల కూతుర్లు నిర్మాతలుగా, నటీమణులుగా కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు కాబట్టి.. వారి ప్యాషన్ అనేది కూడా వృధా కావడం లేదు అనే చెప్పాలి.

సరే ఈ విషయాలు అన్నీ పక్కన పెట్టేసి ప్రస్తుతం.. టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోయిన్ల కూతుర్ల ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి :

1) కృష్ణంరాజు : రెబల్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు గారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అంటే ప్రభాస్ కి సోదరీమణులు అన్న మాట. వారి పేర్లు ప్రసీద,ప్రకీర్తి,ప్రదీప్తి. వీరిలో ప్రసీద ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

2) జగపతి బాబు : మ్యాన్లీ హీరో జగ్గూభాయ్ కూడా ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ గా ఓ వెలుగు వెలిగాడు. ఈయనకు ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు మేఘన, పూజ.

3) వెంకటేష్ : మన విక్టరీ వెంకటేష్ కు ముగ్గురు కూతుర్లు. వారి పేర్లు అశ్రిత, భావన, హయ వాహిని

4) రవితేజ : మాస్ మహారాజ్ రవితేజ కి ఇద్దరు పిల్లలు.ఒక అబ్బాయి … అతన్ని ‘రాజా ది గ్రేట్’ లో చూసాం. ఇక అమ్మాయి పేరు మోక్షదా భూపతి రాజు.

5) శ్రీకాంత్ : సీనియర్ హీరో, విలక్షణ నటుడు అయిన శ్రీకాంత్ కు ఓ కొడుకు, కూతురు. కొడుకు రోషన్ ఆల్రెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక కూతురు మేధా అప్పుడప్పుడు మీడియాకి కనిపిస్తూ ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus