ఆనాడు హీరోయిన్ అంటే అందానికే కాదు….అభినయానికి కూడా ఎంతో అందాన్ని ఇచ్చే వారీగా ఉండేవారు. అయితే అదే క్రమంలో కాలం మారుతున్న కొద్ది హీరోయిన్స్ పాత్రల్లోనే కాదు…వారు ఎంచుకునే సినిమాల్లో కూడా మార్పులు వచ్చాయి…ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్ అంటే కేవలం పాటలకు….ఎక్స్‌పోసింగ్ కు పనికి వచ్చే ఒక పాత్ర అంతే…ఇంకా చెప్పాలి అంటే….కధతో, కధనంతో, పాత్రతో, పర్ఫార్మెన్స్ తో ఏమాత్రం సంభంధం ఉండదు….రెమ్యునిరేషన్ ఎక్కువ ఇస్తే చాలు….ఇప్పటి హీరోయిన్స్ సినిమాలు చేసేస్తున్నారు…దర్శకులు కూడా హీరోపై పెట్టే ఫోకస్ లో కనీసం అంటే….కనీసం 20% పెడితే హీరోయిన్ పాత్రల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించవచ్చు.
ఇక ప్రస్తుత హీరోయిన్స్ సంగతి…సినిమాల్లో పాత్రల విషయమే తీసుకుంటే…బాబు బంగారంలో నయనతార పాత్ర, జనతా గ్యారేజ్ లో సమంత.. నిత్యా మీనన్ ల పాత్రలు. ఇంకొక్కడు సినిమాలో నిత్యా మీనన్ రోల్ ఇలా ప్రతీదీ…ఏదో ఉండాలి కాబట్టి పెట్టాం అన్నట్టుగా ఉన్నాయి పాత్రలు….ఆ హీరోయిన్స్ స్థాయికి సరిపడా పాత్రలు అయితే కానే కావు అనే చెప్పాలి…ఇక తమన్నా…శృతి హసన్ అయితే క్యాష్ ఇస్తే ఐటమ్ సాంగ్స్ చేసేందుకు కూడా రెడీనే అనేస్తున్నారు…ఇలా కాసుల కోసం కక్కుర్తి పడుతూ..హీరోయిన్స్ కేవలం పార్ట్ టైమ్ పాత్రలకు పరిమితం ఉన్నారు.